రికార్డు స్థాయిలో కిడ్నీ ఆపరేషన్లు.. లైవ్​ ట్రాన్స్​ప్లాంటేషన్లే ఎక్కువ..!

by Vinod kumar |   ( Updated:2023-03-29 17:16:10.0  )
రికార్డు స్థాయిలో కిడ్నీ ఆపరేషన్లు.. లైవ్​ ట్రాన్స్​ప్లాంటేషన్లే ఎక్కువ..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా లైవ్​ట్రాన్స్​ప్లాంటేషన్స్​(బతికి ఉన్న మనిషి నుంచి మరోక పేషెంట్ కు అవయవాలు మార్చడం) ఎక్కువ జరుగుతున్నాయి. 2013 నుంచి 2022(మార్చి) వరకు ఏకంగా 4,147 అవయవ మార్పిడిలు జరిగాయి. అత్యధికంగా కిడ్నీలు 3075, లివర్​1072 మార్పిడి జరిగాయి.వీటిలో ఒక్క నిమ్స్​ఆసుపత్రిలోనే 577 లైవ్​ట్రాన్స్​ప్లాంటేషన్లు జరగడం గమనార్హం. రికార్డు స్థాయిలో కిడ్నీ ఆపరేషర్లు జరిగాయి.ఇక ప్రభుత్వం ఆధీనంలో నిమ్స్​, గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులలో కాడవర్​(మరణించిన వ్యక్తి నుంచి అవయవాలు సేకరించి ఇతర పేషెంట్​కు ఇవ్వడం)విధానంలో సర్జరీలు జరుగుతున్నాయి.2013 నుంచి 2023 వరకు నిమ్స్​ లో 372, ఉస్మానియాలో 71, గాంధీలో 11 సర్జరీలు నిర్వహించి ఆర్గాన్స్​మార్చారు.

1211 మంది నుంచి..

రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్, ప్రభుత్వాసుపత్రి పరిధిలో ఇప్పటి వరకు 4,564 అవయవ మార్పిడిలు జరిగాయి.1211 మంది డోనర్లు నుంచి ఆర్గాన్స్​ను సేకరించారు.వీటిలో 1815 కిడ్నీలు, 1114 లివర్​లు,173 హార్ట్​లు, 1075 కార్నియాస్​,170 హార్ట్​ వాల్వ్స్​ ,205 లంగ్స్​,12 ప్రాంకీస్​లను ఆపరేషన్లు చేసి అవసరమైన పేషెంట్లకు ఆమర్చారు.ఈ ప్రక్రియ అంతా జీవన్​దాన్​పర్యవేక్షణలో జరిగింది. ఆన్​లైన్​ లో అప్లై చేసినోళ్లకు పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాతనే పేషెంట్లకు అవయవ మార్పిడిలు చేస్తున్నట్లు వైద్యాధికారులు పేర్కొంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed