- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆరు గ్యారంటీల అమలుపై ఖర్గే కీలక ప్రకటన
దిశ, వెబ్‌డెస్క్: విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని దేశానికి తీసుకొచ్చి ఒక్కొక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానని చెప్పిన మోడీ ఆ హామీని విస్మరించారని ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. ఇవాళ హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న బూత్ కన్వీనర్ల రాష్ట్ర స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మోడీ ప్రధాని అయిన నాటి నుంచి తెలంగాణ రాష్ట్రానికి అనేక హామీలు ఇచ్చారని అన్నారు. అందులో ఏ ఒక్కటి కూడా అమలు చేసిన పాపాన పోలేదన్నారు. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని దేశానికి తీసుకొచ్చి ఒక్కొక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానని చెప్పిన ప్రధాని మోడీ ఆ విషయాన్నే విస్మరించారని ఆరోపించారు.
భవిష్యత్తులో నేతలంతా కలిసి పనిచేస్తేనే పార్టీకి, ప్రభుత్వానికి మంచి రోజులు ఉంటాయని అన్నారు. ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో రెండింటిని అమలు చేశామని, మరికొద్ది రోజుల్లో మరో రెండు హామీలను అమలు చేస్తామని తెలిపారు. రెండు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగబోతున్నాయని ఈ నేపథ్యంలో నాయకులు, కార్యకర్తలంతా సమన్వయంతో పని చేసి మెజారిటీ ఎంపీ సీట్లు సాధించాలని సూచించారు. దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పెరిగిపోయిందని ఆరోపించారు. పాకిస్తాన్, చైనా, దేవుళ్ల పేరు చెప్పి మోడీ రాజకీయాలు చేస్తున్నారన ధ్వజమెత్తారు.