అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు

by Sridhar Babu |   ( Updated:2023-11-09 11:22:02.0  )
అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు
X

దిశ, ఖమ్మం రూరల్ ​: కేంద్రంలో ఉన్న బీజేపీ, స్టేట్​లో ఉన్న ఆపధర్మ సీఎం కలిసి తన పై ఏకకాలంలో 32 ఇండ్ల పై దాడులు చేసినంత మాత్రాన భయపడేదిలేదని, అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరని పాలేరు కాంగ్రెస్​ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం నామినేషన్​ వేయాలని ప్రకటించిన తరువాత తెల్లవారుజాము నుంచి ఏకాలంలో తన ఇంటితో పాటు కార్యాలయాలే కాకుండా తనకు సంబంధించిన 32 మంది ఇండ్ల పై ఐటీ దాడులు జరిగాయని తెలిపారు.

ఈ రోజు నామినేషన్​ వేస్తున్నానని తెలిసి ఉదయం 5 గంటలకు వచ్చిన ఐటీ అధికారులు తనను బయటకు పంపేదిలేదని భీష్మించుకున్నారని తెలిపారు. తన అభిమానులు, కార్యకర్తలు చీఫ్​ ఎలక్షణ్​ కమిషన్​కు ఇక్కడి పరిస్థితి వివరించిన తరువాత, సుమారు 10 వేలమందికి పైగా మీడియా ద్వారా తెలుసుకుని తన ఇంటి వద్దకు వచ్చారని తెలిపారు. ఇక్కడి ఐటీ అధికారులు ఉన్నతాధికారుల ఆదేశాలతో లా అండ్​ ఆర్డర్​ కంట్రోల్​ తప్పితే దానికి ఎలక్షన్​ కమిషన్​ బాధ్యత వహించాల్సి వస్తుందని తనకు రెండు గంటల వరకు సమయం ఇచ్చారని తెలిపారు. తెలంగాణ ప్రజల దీవెనలతో వచ్చే నెల 9న ప్రమాణస్వీకారం చేయబోతున్నట్టు చెప్పారు. బీజేపీ తెలంగాణలో గెలవలేదు కాబట్టి మా పై దాడులు చేస్తున్నారని విమర్శించారు. బీఆర్​ఎస్​ను అధికారంలోకి తీసుకొచ్చేందుకే బీజేపీ ప్రయత్నిస్తుందన్నారు.

శ్రీనివాసరెడ్డి గెలుపు ఆపడం ఎవరి తరం కాదు‌‌ : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు

పాలేరు కాంగ్రెస్​ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గెలుపు ఆపడం ఎవరితరం కాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఐటీ దాడులు చేయడం పట్ల ఖండిస్తున్నట్లు తెలిపారు. 50 వేల మోజార్టీతో శ్రీనన్న గెలవబోతున్నట్లు తెలిపారు. పాలేరులో సీపీఐ బలంగా ఉందని, తమ వాళ్లు కష్టపడి పనిచేస్తారని తెలిపారు. బీఆర్​ఎస్​, బీజేపీ నాయకుల ఇంట్లో దాడులు ఎందుకు జరగట్లేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర కమిటీ సభ్యుడు రాయల నాగేశ్వర్​రావు, కాంగ్రెస్​, సీపీఐ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story