పోలీస్ కుటుంబాలకు అండగా ఉంటాంః సీపీ సునీల్ దత్

by Nagam Mallesh |
పోలీస్ కుటుంబాలకు అండగా ఉంటాంః సీపీ సునీల్ దత్
X

దిశ, ఖమ్మం సిటీ; చనిపోయిన పోలీస్ కుటుంబాలకు అండగా ఉంటామని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. ఇటీవల మరణించిన ఖమ్మం పోలీస్ కంట్రోల్ రూమ్ లో భాధ్యతలు నిర్వహించిన హెడ్ కానిస్టేబుల్ ఏ.వెంకట్రావు కుటుంబ సభ్యులకు రూ.1,65,000/ ఎక్స్‌గ్రేషియా చెక్కును బుధవారం సునీల్ దత్ అందజేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ శాఖపరంగా ఎటువంటి సహాయ సహకారాలు అందించేందుకైనా పోలీస్ అధికారులు అందుబాటులో వుంటారని అన్నారు. పోలీసు కుటుంబాలకు అన్ని విధాల ఆదుకుంటామన్నారు.

Advertisement

Next Story