Minister Tummala : ఆగస్టు 15 నాటికి నీళ్లు విడుదల చేస్తాం

by Sridhar Babu |
Minister Tummala : ఆగస్టు 15 నాటికి నీళ్లు విడుదల చేస్తాం
X

దిశ, ఏన్కూరు : మండలం పరిధిలోని హిమాంనగర్ వద్ద రేపల్లెవాడ గ్రామాల మధ్య జరుగుతున్న సీతారామ ప్రాజెక్టు లింకు కెనాల్ పనులను శనివారం సాయంత్రం వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.... సీతారామ ప్రాజెక్టు లింకు కెనాల్ పనులను రాత్రి పగలు కష్టపడి ఆగస్టు 15 నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీతారామ ప్రాజెక్టును ఆగస్టు 15 న ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. భవిష్యత్తులో నాగార్జునసాగర్ కెనాల్​కు నీళ్లు ఇవ్వాలంటే లింక్ కెనాల్ గోదావరి జలాలను ఇవ్వొచ్చని మొన్న భద్రాచలం వచ్చినప్పుడు ఈ విషయాన్ని ఎమ్మెల్యేలతో చర్చించినట్టు తెలిపారు. వర్షాల , భూ సేకరణ, గుజరాత్ పైపులైను వల్ల కొద్దిగా ఆలస్యమైతదని అనుకున్నా ప్రాజెక్టు పనులను సమయానికి పూర్తి చేస్తామని తెలిపారు.

పూసగూడెం, కమలాపురం పంపు సెట్లను వారం రోజుల్లో ట్రయల్ రన్ వేస్తామని వెల్లడించారు. నాగార్జునసాగర్ లెఫ్ట్ కెనాల్ కు నేటి నుండి నీళ్లు వస్తాయని తెలిపారు. సీతారామ ప్రాజెక్టు కేవలం తక్కువ ఖర్చుతో 70 కోట్ల తో సుమారు లక్షన్నర ఎకరాలు నుంచి రెండు లక్షల ఎకరాల వరకు సాగునీరు, తాగునీరు అందిస్తామని అన్నారు. భూములు ఇచ్చిన రైతులను ప్రభుత్వ పరంగా ఆదుకొని నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. సీతారామ ప్రాజెక్టుకు భూములు ఇచ్చిన రైతులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. అధికారులు ఈ ప్రాజెక్టు పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సీఈ అర్జున్, ఎంపీపీ ఆరెం వరలక్ష్మి, గుత్త వెంకటేశ్వరరావు, ఆరెం రామయ్య, ఏన్కూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు స్వర్ణ నరేందర్, మేడ ధర్మారావు, శోభన్ నాయక్, వాసిరెడ్డి నాగేశ్వరరావు, సాయి రోహిత్, జనార్ధన్, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed