- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రైతులకు సకాలంలో నీరందిస్తాం.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్
దిశ, నేలకొండపల్లి : రైతులకు సకాలంలో సాగునీరు అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో మూడు కోట్లతో నిర్మించిన భక్త రామదాసు ధ్యాన మందిరంలోని ఆడిటోరియాన్ని ఆయన ప్రారంభించారు. ముందుగా మంత్రికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ధ్యాన మందిరంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. భక్తరామదాసు ఇక్కడే జన్మించారనీ ఆయన జన్మస్థలాన్ని యావత్ ప్రపంచానికి తెలియజేయాలన్నారు. నా చేతుల మీదుగా ఆడిటోరియం ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. మూడు కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టామన్నారు. ఇందులో ఉంటే ప్రశాంతత కనిపిస్తుందనీ ఇక్కడే ఉన్న బౌద్ద స్థూపాన్ని పరిశీలించామన్నారు. ప్రజలకు భక్తరామదాసు గురించి తెలియాలనే కోణంలో ధ్యాన మందిరాన్ని ఎలా అభివృద్ధి చేయాలో నిపుణులతో చర్చిస్తామన్నారు. భక్తరామదాసు ఈ ప్రభుత్వానికి ఆదర్శమన్నారు. కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి,రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్ రాయల నాగేశ్వరరావు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
లిఫ్ట్ ద్వారా సాగునీరు విడుదల
మండల పరిధిలోని చెరువు మాదారం లిఫ్ట్ ద్వారా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సాగునీటిని విడుదల చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు సకాలంలో నీరందేలాగా చూడాలని అన్నారు. కాలవ రిపేర్లు ఏమైనా ఉంటే చేయించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీ రఘురాం రెడ్డి,రాష్ట్ర చైర్మన్లు రాయల నాగేశ్వరావు,మువ్వా విజయ్ బాబు, లిఫ్ట్ చైర్మన్ ఎలగల భూషయ్య,నాయకులు శాఖమూరి రమేష్, వెన్నపూసల సీతారాములు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.