ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన విప్పలమడక విద్యార్థి

by Disha Web Desk 12 |
ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన విప్పలమడక విద్యార్థి
X

దిశ, వైరా: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు బుధవారం ప్రకటించిన ఫలితాల్లో వైరా మండలంలోని విప్పలమడక గ్రామానికి చెందిన విద్యార్థి యడ్లపల్లి యశ్వంత్ సత్తా చాటాడు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఎంపీసీ విభాగంలో యశ్వంత్ 470 మార్కులకు గాను 464 మార్కులు సాధించాడు. ఇంగ్లీషులో 96 మార్కులు, సాంస్క్రిట్‌లో 98 మార్కులు, మ్యాథ్స్‌ఏ లో 75 మార్కులు, మ్యాథ్స్ బి లో 75 మార్కులు, ఫిజిక్స్‌లో 60 మార్కులు, కెమిస్ట్రీలో 60 మార్కులు సాధించాడు. ప్రాక్టికల్ పరీక్షల్లో నూరు శాతం మార్కులు సాధించాడు. యశ్వంత్ 10వ తరగతి వరకు సీబీఎస్ఈ విద్యను ఖమ్మంలోని న్యూ ఈరా విద్యా సంస్థలకు చెందిన న్యూ లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో అభ్యసించారు. ప్రస్తుతం ఇంటర్మీడియట్‌ను హైదరాబాద్ రావిర్యాలలోని నారాయణ జూనియర్ కళాశాలలో అభ్యసిస్తున్నారు. అత్యధిక మార్కులు సాధించిన యశ్వంత్‌ను తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులు అభినందించారు.



Next Story