తల్లికి నరకం చూపిన ఇంద్రజ.. తప్పు ఒప్పుకున్న నటి.. జీవితకాల శిక్ష?

by Dishafeatures3 |
తల్లికి నరకం చూపిన ఇంద్రజ.. తప్పు ఒప్పుకున్న నటి.. జీవితకాల శిక్ష?
X

దిశ, సినిమా : మదర్స్ డే సందర్భంగా ఓ టీవీ ఛానల్ ప్రత్యేక కార్యక్రమం ప్లాన్ చేసింది. బుల్లితెర నటీనటులు, వారి తల్లులు ఈ షోలో పాల్గొని వారి అమ్మ గొప్పతనం గురించి తెలిపారు. బహుమతులు అందించారు. డ్యాన్సులు కూడా చేశారు. ఆ తర్వాత నటి ఇంద్రజను ఘనంగా సన్మానించారు. తమను అమ్మలా చూసుకుంటున్న ఆమెకు స్పెషల్ గిఫ్ట్స్ కూడా ఇచ్చారు. ఇదంతా బాగానే ఉన్నా.. ఆమె ఒక్కసారిగా ఎమోషనల్ అవడాన్ని నటులతోపాటు ఆడియన్స్ కూడా తట్టుకోలేక పోయారు.

మనం ఎంత గొప్ప పేరు సంపాదించినా.. బయట ఎన్ని రాచ కార్యాలు వెలగబెట్టినా.. బిజీ పర్సన్ అని సొసైటీలో స్టేటస్ ఉన్నా.. తల్లిని చూసుకోలేకపోతే వేస్ట్ అని చెప్పింది. అమ్మ ఉన్నప్పుడే ఆమెకు నచ్చినట్లు అన్నీ చేసి పెట్టాలి.. లేకపోతే ఏమీ చేయలేమని ఏడ్చేసింది. తన తల్లి చివరి రోజుల్లో గుడికి తీసుకెళ్లమని అడిగింది కానీ చేయలేకపోయానని.. ఈ రిగ్రెషన్ జీవితాంతం ఉంటుందంటూ ఎంతమంది ఓదార్చినా ఏడుస్తూనే ఉంది. ఇక దీనిపై కామెంట్స్ చేస్తున్న ఆడియన్స్.. 'పాపం ఆ తల్లి ఎంత బాధపడి ఉంటుందో.. లేవలేని స్థితిలో ఉందేమో నరకం అనుభవించి ఉంటది కదా.. ఇది ఇంద్రజకు జీవితకాల శిక్షనే' అని అభిప్రాయం వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed