- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శవంతం.. MLA Ramulu Naik
దిశ, జూలూరుపాడు: సంక్షేమ పథకాల అమల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ అన్నారు. శనివారం జూలూరుపాడులోని ఆర్యవైశ్య కల్యాణ మండపంలో 49 మంది కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు ఆయన చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ రాకముందు రాష్ట్ర భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉండేదన్నారు. స్వరాష్ట్రం ఏర్పడ్డాక అన్ని రంగాల్లోనూ ముందుకు పోతుందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, రైతులకు రైతు బీమా, రైతుబంధు, ఉచిత విద్యుత్ వంటి ఎన్నో కల్పించారని పేర్కొన్నారు. దళిత బంధు ద్వారా ఆర్ధికంగా ఎదిగేందుకు ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల సాయం అందిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లోథర్ విల్సన్, సీఐ వసంత కుమార్, ఎంపీపీ సోనీ, రైతుబంధు కన్వీనర్ వై.వీరభద్రం, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి రంగారావు, గిరిబాబు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.