- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జనం ఫుల్.. నేతల ప్రసంగాలు నిల్..
దిశ, వైరా : వైరా మండలంలోని ఖానాపురం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా మంగళవారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంకు జనం అత్యధిక సంఖ్యలో హాజరు అయినప్పటికీ ముఖ్యనేతల ప్రసంగాలు కరువయ్యాయి. కేవలం మండలస్థాయి ప్రజాప్రతినిధులు, నాయకులు మాత్రమే ఈ ఆత్మీయసమ్మేళనంలో ప్రసంగించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఆత్మీయ సమ్మేలానికి సుమారు 3వేల మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. అయితే ఈ సమ్మేళనానికి ముఖ్యఅతిథులుగా హాజరు కావలసిన ఎంపీలు నామానాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథి రెడ్డి సకాలంలో హాజరు కాలేకపోయారు. వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ హాజరైన ప్రసంగించకపోవడం విశేషం. నేతల ప్రసంగాలు లేని సమ్మేళనం గందరగోళంగా మారింది. భోజనాల కోసం తోపులాట జరగటంతో ఇక్కడ రచ్చరచ్చగా మారింది.
సమయానికి రాలేకపోయిన ఎంపీలు...
ఖానాపురంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఎంపీలు నామనాగేశ్వరరావు, బండి పార్థసారథి రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర సకాలంలో హాజరు కాలేకపోయారు. వీరు మంగళవారం ఉదయం 10 గంటలకే వైరా ఎమ్మెల్యే క్యాంప్ క్యారాయానికి చేరుకున్నారు. అయితే ఖానాపురం గ్రామానికి నాయకులు, కార్యకర్తలు ఇంకా చేరుకోలేదని సమాచారంతో ఎంపీలు సత్తుపల్లిలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి వెళ్లారు. అనంతరం 11 గంటల సమయంలో వైరా నుంచి ఖానాపురం గ్రామానికి ఎమ్మెల్యే రాములు నాయక్ వెళ్లారు. ఈ సందర్భంగా ఖానాపురం గ్రామంలో బీఆర్ఎస్ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. డప్పు వాయిద్యాలు, గిరిజన మహిళల నృత్యాలతో ఈ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ర్యాలీలో ప్రచార రథంపై నుంచి రాములు నాయక్ ప్రజలకు అభిమానం తెలియజేశారు. అనంతరం ఆత్మీయ సమ్మేళన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో స్థానిక మండలం నేతలు ప్రజాప్రతినిధులు ప్రసంగించారు. ఎంపీల రాక కోసం ఎమ్మెల్యే రాములు నాయక్ తో పాటు సభకుహాజరైన సుమారు మూడు వేల మంది నాయకులు కార్యకర్తలు వేచి చూశారు.
మధ్యాహ్నం 1.30 గంటల వరకు కూడా ఖానాపురం గ్రామానికి ఎంపీలు చేరుకోక పోవటంతో నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా భోజనాలకు కోసం ఎగబడ్డారు. దీంతో భోజనాల కౌంటర్ల వద్ద తీవ్ర తోపులాట జరిగింది. భోజనాలు పెట్టేవారు చేతులెత్తేయడంతో ఎవరికి వారు పెనుగులాడుతూ భోజనాలు వడ్డించుకునే దృశ్యాలు కనిపించాయి. దీంతో వైరా ఎస్సై శాఖమూరి వీరప్రసాద్ తో పాటు పోలీస్ సిబ్బంది భోజనాల కౌంటర్ల వద్ద పరిస్థితిని చక్కబెట్టారు. ఎంపీలు వచ్చాక ప్రసంగించాలనుకున్న ఎమ్మెల్యేకు కూడా చేదు అనుభవం ఎదురయింది. ఎంపీలు రాకపోవడంతో జనాలు ఒక్కసారిగా భోజనాలకు వెళ్ళటంతో ఎమ్మెల్యే ప్రసంగించకుండానే సభ ముగిసింది. అనంతరం మధ్యాహ్నం 2:00 గంటల సమయంలో ఎంపీలు వైరా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి చేరుకొని భోజనం చేశారు. ముఖ్యనేతల ప్రసంగాలు లేకపోవడంతో సమ్మేళనానికి వచ్చిన నాయకులు కార్యకర్తలు నిరుత్సాహంతో తిరిగి వెళ్లారు.