సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ : సత్తుపల్లి ఎమ్మెల్యే

by Aamani |   ( Updated:2024-10-10 14:41:54.0  )
సంస్కృతి సాంప్రదాయాలకు  ప్రతీక బతుకమ్మ : సత్తుపల్లి ఎమ్మెల్యే
X

దిశ,సత్తుపల్లి: తెలుగు రాష్ట్రాల ప్రజల సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ అన్నారు. సత్తుపల్లి జేవియర్ కళాశాల మైదానంలో అంగన్వాడీ, ఐకెపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ ఉత్సవాలలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ మాట్లాడుతూ, పాడిపంటలతో రైతన్నలు ఆనందోత్సవాలతో వర్ధిల్లాలని దసరా ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు.

ఎమ్మెల్యే బతుకమ్మను ఎత్తుకొని ఆటపాటలతో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆమె ముందుగా స్థానిక ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే దంపతులకు ఐసీడీఎస్ ఐకెపీ మహిళల ఆధ్వర్యంలో శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో చిన్న నాగేశ్వరరావు, ఐకెపీ సుబ్బారావు, సత్తుపల్లి ఐసీడీఎస్ సీడీపీవో కనకదుర్గ, సూపర్వైజర్లు గంగాజలం, సుజాత, మహాలక్ష్మి, రమాదేవి, రజిని, కమల, భాగ్యలక్ష్మి, భవాని, అంగన్వాడీ టీచర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed