- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
EX MLA Sandra Venkata Veeraiah : రాజకీయాలలో గెలుపు ఓటములు సహజం..
దిశ, సత్తుపల్లి : గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్ట్ పనులు 90 % శాతం పూర్తయ్యాయని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. శనివారం సాయంత్రం సత్తుపల్లి పట్టణంలో స్థానిక లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన వేంసూరు, సత్తుపల్లి, పెనుబల్లి మండలాల ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సభ్యుల సన్మాన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సండ్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 8 నెలల్లో సీతారామ ప్రాజెక్టు పనులు 10 % శాతం పూర్తి చేసి ప్రాజెక్టు పూర్తి మేమే చేశామని గొప్పల చెబుతుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో గ్రామాలలో పాలన లేక పారిశుద్ధ్యం పడకేసిందని ప్రతి ఇంటికి ఇద్దరు ముగ్గురు జ్వరాలు, సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారని, గ్రామపంచాయతీలో ప్రత్యేక పాలన అధికారులతో పారిశుధ్య సేవలు అందించడంలో 8. నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు రైతు రుణమాఫీ కేవలం 35% శాతం మంది రైతులకు పూర్తి చేసిందని ఆయన అన్నారు. రాజకీయాలలో గెలుపోటములు సహజం కానీ ప్రజాసేవలో ప్రజల తరపున ప్రతిపక్ష హోదాలో గట్టిగా పోరాడాలని బీఆర్ఎస్ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కళ్యాణ లక్ష్మి చెక్కులతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పిన హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. సత్తుపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీఎంఆర్ఎఫ్ కు అప్లై చేసుకుంటే నేటి ప్రభుత్వం ఇప్పటివరకు 1500 మందికి చెక్కులు పంపిణీ చేసిందని వారు తిరిగి తనకు కృతజ్ఞతలు తెలిపారని ఆయన అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లు ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులుగా పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేశారు.
ప్రతి ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు, సభ్యురాలకు పుష్పగుచ్చం అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్, మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, జెడ్పీటీసీ సభ్యులు కూసంపూడి రామారావు, వేంసూరు జెడ్పీటీసీ సభ్యురాలు, మారోజు సుమలత సురేష్, సత్తుపల్లి ఎంపీపీ దొడ్డ హైమావతి శంకర్రావు, వేంసూరు, ఎంపీపీ వెంకటేశ్వరరావు, చెక్కిలాల మోహన్రావు, లక్కినేని వినీల అలేఖ్య, సత్తుపల్లి బీఆర్ఎస్ మండల అధ్యక్షులు యాగంటి శ్రీనివాసరావు, పట్టణ అధ్యక్షులు మోనార్క రఫీ, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ శీలపురెడ్డి హరికృష్ణ రెడ్డి, పలువురు సత్తుపల్లి మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు వేంసూరు, సత్తుపల్లి, పెనుబల్లి మండలాల ఎంపీటీసీ సభ్యులు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.