ట్రాక్టర్ చోరీ చేశారు...మధ్యలోనే వదిలి వెళ్లారు... ఎందుకో తెలుసా

by Sridhar Babu |   ( Updated:2023-08-31 10:02:32.0  )
ట్రాక్టర్ చోరీ చేశారు...మధ్యలోనే వదిలి వెళ్లారు... ఎందుకో తెలుసా
X

దిశ, బోనకల్ : బోనకల్లు భారత్ పెట్రోల్ బంకులో గురువారం తెల్లవారు జామున ట్రాక్టర్ చోరీ జరిగింది. కానీ దానిని కొంత దూరం తీసుకెళ్లి వదిలి వెళ్లారు. ట్రాక్టర్ యజమాని బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన తేరాల నాగరాజు బోనకల్ భారత్ పెట్రోల్ బంకులో ట్రాక్టర్ పెట్టి ఇంటికి వెళ్లాడు. రాత్రి ఒంటిగంట సమయంలో దుండగులు ట్రాక్టర్ తీసుకొని ముష్టికుంట

గ్రామ సమీపంలోకి వెళ్లగా ట్రాక్టర్ లో డీజిల్ అయిపోయింది. దాంతో అక్కడే దానిని వదిలిపెట్టి వెళ్లారు. గురువారం పోలీసులకు సమాచారం అందగా యజమాని నాగరాజుకు అప్పగించారు. గతంలో కూడా అనేక సందర్భాల్లో బోనకల్​ దుకాణాల్లో, వైన్ షాప్ లో, బట్టల షాపుల్లో చోరీలు జరిగాయి. దాంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. దుండగులను వెంటనే పట్టుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

Next Story