Former MLA Sandra Venkata Veeraiah : ఎస్సీ వర్గీకరణ తీర్పు చారిత్రాత్మకం

by Sridhar Babu |
Former MLA Sandra Venkata Veeraiah : ఎస్సీ వర్గీకరణ తీర్పు చారిత్రాత్మకం
X

దిశ, ఖమ్మం : భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన తీర్పు చారిత్రాత్మక విషయమని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. గురువారం ఖమ్మం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1965వ సంవత్సరంలో లాల్ బహుదూర్ శాస్త్రి మంత్రివర్గంలో ఎస్సీ వర్గీకరణకై తొలి అడుగులు పడ్డాయి అన్నారు. 1994 జూలై 7వ తేదీన ప్రకాశం జిల్లాలోని ఈదురుమళ్ళ గ్రామంలో మంద కృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణకు తొలి బీజం వేశారన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు మాజీ సీఎం కేసీఆర్ పాత్ర ఎంత కీలకమో..ఎస్సీ వర్గీకరణ పక్రియలో మందకృష్ణ మాదిగ

పాత్ర అంత కీలకమన్నారు. 1995 సంవత్సరంలో నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో సండ్ర వెంకట వీరయ్య ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మేరీ అనే యువతి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అసెంబ్లీ భవన్ పై నినాదాలు చేసిందన్నారు. అప్పటి గవర్నమెంట్ తనపై సీరియస్ అయిందన్నారు. 2000/2004 సంవత్సరం వరకు ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ప్రక్రియలో సంబంధించిన అంశాలపై స్పష్టత లేకపోవడం వలన ఈ ప్రక్రియ జాప్యం అయ్యిందన్నారు. మాజీ సీఎం కేసీఆర్ కూడా అప్పటి ప్రధాని మోదీతో ఎస్సీ వర్గీకరణ ప్రక్రియకు సంబంధించి వినతి పత్రాన్ని అందజేశారన్నారు. ఎస్సీ వర్గీకరణ తీర్పు ప్రతి ఒక్కరి విజయం అన్నారు.

ఈ తీర్పు అనేది కొందరు విజయమో.. మరికొందరు అపజయమో కాదు అని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ తీర్పు సందర్భంగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇకనుంచి విద్యకు సంబంధించి, ఉద్యోగ నోటిఫికేషన్ సంబంధించి రిజర్వేషన్ ఫలాలు వర్తించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్సీ వర్గీకరణ తీర్పు శుభ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రత్యేకంగా వారు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బెల్లం ఉమా, నాయకులు బెల్లం వేణుగోపాల్, వెంకటరమణ,‌ సుబ్బారావు, నరేందర్, సతీష్, నెమలి కిషోర్, హెచ్ ప్రసాద్ , వీరభద్రం,‌అనిల్ కుమార్ మరియు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed