రోజురోజుకు కాంగ్రెస్ కు ఆదరణ తగ్గుతుంది

by Sridhar Babu |   ( Updated:2023-11-12 09:07:27.0  )
రోజురోజుకు కాంగ్రెస్ కు ఆదరణ తగ్గుతుంది
X

దిశ, బోనకల్ : కాంగ్రెస్ పార్టీకి రోజురోజుకు ఆదరణ తగ్గుతుందని ప్రజల్లో బీఆర్ఎస్ కు అపూర్వ స్పందన వస్తుందని, మధిరలో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి లింగాల కమల్ రాజు అన్నారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమల్ రాజ్ మాట్లాడుతూ మధిర నియోజకవర్గంలో ఈసారి బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమన్నారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందంజలో ఉందన్నారు. 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించే స్థాయి నుండి నేడు మూడు కోట్ల ధాన్యరాశి పండించే స్థాయికి రైతన్నలు ఎదిగారన్నారు. కాంగ్రెస్ పార్టీకి వ్యవసాయం మీద అవగాహన లేదని ఆ పార్టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడిన

మాటలే అందుకు నిదర్శనం అన్నారు. వ్యవసాయానికి మూడు గంటలు విద్యుత్ ఇస్తామని చెప్పడమే అందుకు నిదర్శనం అన్నారు. కర్ణాటక డిప్యూటీ సీఎం స్వయంగా తమ రాష్ట్రంలో ఐదు గంటల విద్యుత్ ఇస్తున్నామని చెప్పారన్నారు. 24 గంటలు కరెంటు ఇచ్చే కేసీఆర్ కావాలా మూడు గంటలు కరెంటు ఇచ్చే కాంగ్రెస్ కావాలనో ప్రజలే తేల్చుకోవాలన్నారు. కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదని కేసీఆర్ వస్తే నిరంతర విద్యుత్తు ఉంటుందన్నారు. అనంతరం కొండబాల కోటేశ్వరరావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే క్రాప్ హాలిడే రోజులు మరలా వస్తాయన్నారు. మధిర నియోజకవర్గంలో కమల్ రాజ్ గెలవాలని ప్రజలు కోరుకుంటున్నారు అన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని, వ్యతిరేకత ఉందన్నారు. కార్యక్రమంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు చేబ్రోలు మల్లికార్జున్, బానోత్ కొండ, చావా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed