police : నది దాటించి తల్లి బిడ్డలను కాపాడిన పోలీసులు..

by Sumithra |
police : నది దాటించి తల్లి బిడ్డలను కాపాడిన పోలీసులు..
X

దిశ, భద్రాచలం : చతిస్గడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో కెరిపు 196 క్యాంప్ నంబి, కోబ్రా 205 సీఆర్పీఎఫ్ జవానుల మానవత్వం, సాహసం తల్లి, నెలలు నిండని శిశువును రక్షించి నంబి ధారా నది దాటేలా చేశాయి. వివరాలు పరిశీలిస్తే నంబి నయాపర నివాసి మద్వి జాగి అనే గర్భిణీకి నెలలు నిండకుండానే ప్రసవం కావడంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉసూర్‌కు వెళ్లాల్సి వచ్చింది. ఉస్సూర్, నంబి మధ్య ఉన్న నంబి ధరా నదిలో ఉధృతంగా నీరు ప్రవహిస్తుండడంతో సైనికులు నవజాత శిశువు, తల్లిని సురక్షితంగా దాటించి, నవజాత శిశువు, తల్లిని చికిత్స కోసం ఉసూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకుని వెళ్లారు. సమయానికి జవాన్లు స్పందించి సాహసంతో తల్లి బిడ్డలను నది దాటించి వైద్య చికిత్స అందేలా చేయడంతో ప్రస్తుతం తల్లి బిడ్డలకు క్షేమంగా ఉన్నారు.

Advertisement

Next Story