- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పేదోడి సంక్షేమమే లక్ష్యం
దిశ, ఖమ్మం రూరల్ : పేదోడి సంక్షేమమే తమ లక్ష్యం అని, పేదోడి ఆస్తి వారికి చెందే వరకు పనిచేస్తామని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం రూరల్ మండలం ఎంపీ పాలెంలో రూ. 66.10 లక్షలతో నిర్మించ నున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు, ఎంవీ పాలెం నుండి గోళ్లపాడు వరకు రూ. 2 కోట్ల 60 లక్షలతో చేపట్టిన బీటీ రోడ్డు నిర్మాణ పనులకు, కాచిరాజుగూడెం గ్రామంలో రూ. 18 లక్షలతో చేపట్టిన అంతర్గత సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులకు, సీఆర్ఆర్ నిధులు రూ. 2 కోట్ల 75 లక్షల అంచనా వ్యయంతో చింతపల్లి క్రాస్ రోడ్ ఆరెకోడు తండా నుండి తిరుమలాయపాలెం బీటీ రోడ్డు వరకు చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డితో కలిసి రాష్ట్ర రెవెన్యూ, సమాచార, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎంవీ పాలెంలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ మార్పు రావాలని, మీ అందరి దీవెనలతో ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నామని అన్నారు. ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేశామని, వాటిని ప్రాధాన్యత క్రమంలో అమలు చేస్తున్నట్లు తెలిపారు. ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని మాజీ సీఎం కేసీఆర్ రూ.7లక్షల 19 వేల కోట్ల అప్పు చేసి రాష్ట్నాన్ని అథోగతిపాలు చేశాడని విమర్శించారు. తెలంగాణ సంపదను దోచుకొని దాచుకున్న కల్వకుంట్ల కుటుంబాన్ని ప్రజలు చీకొట్టినా సిగ్లులేక ప్రజాప్రభుత్వం పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. చేసిన అప్పుకు ప్రతి నెలా రూ.6,500 కోట్లు అసలు, వడ్డీ కలిపి కడుతున్నామన్నారు. ఎన్నికల ముందు చెప్పిన హామీలను కొన్నింటిని అమలు చేస్తున్నామని, పేదవారికి చిరకాల కోరిక సొంత ఇల్లు అని, దానిని నెరవేర్చే బాధ్యత తనదే అని హామీ ఇచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి తీరుతామన్నారు.
సంక్రాంతి పండుగ నుంచి రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. వెంకటాయపాలెం లో రోడ్ల కోసం కోటి రూపాయలు కేటాయించామని, ఎం వెంకటాయపాలెం నుంచి గోళ్లపాడు వరకు బీటీ రోడ్డు శాంక్షన్ చేశామన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో ఏకగ్రీవానికి అన్ని పార్టీలు కృషి చేయాలని సూచించారు. ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి మట్లాడుతూ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఇందిరమ్మ పాలన సాగుతోందన్నారు. కేంద్రం తెలంగాణ పై చిన్న చూపు చూపినా హామీల అమలులో సీఎం రేవంత్ సర్కార్ ముందుందన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ అధికారి నర్సింహారావు, పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేష్, ఆర్అండ్ బీ ఎస్ఈ హేమలత, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు సరిత, మార్కెట్ కమిటీ అధ్యక్షులు భైరు హరినాథ్‌బాబు, కాంగ్రెస్ జిల్లా పార్టీ నాయకులు సర్ణకుమారి, మద్ది మల్లారెడ్డి, కళ్లెం వెంకటరెడ్డి, బండి జగదీష్, పంతుల్నాయక్, తోట వీరభద్రం, ఆజ్మీర ఆశోక్నాయక్, వెంకటేష్‌యాదవ్, ఆయా గ్రామాలకు చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.