'విలేకరుల ఇంటి స్థలాల పోరాటం న్యాయమైనది..'

by Sumithra |
విలేకరుల ఇంటి స్థలాల పోరాటం న్యాయమైనది..
X

దిశ, కొత్తగూడెం : పత్రికా విలేకరులకు ఇంటి స్థలాలని మంజూరు చేయాలని ధర్నా చేస్తున్న విలేకరులకు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వనమా రాఘవ మద్దతు తెలిపారు. ఆదివారం గంగా హుస్సేన్ బస్తిలో జరుగుతున్న విలేకరుల దీక్ష శిబిరానికి చేరుకుని వారికి సంఘీభావం ప్రకటించారు. విలేకరులు అడుగుతున్న ఇంటి స్థలాల కోరిక న్యాయమైనదని ఆయన అన్నారు. గతంలో కొత్తగూడెం పట్టణంలో మాజీ మంత్రి వనమా సహకారంతోనే విలేకరులకు ఇంటి స్థలాలు కేటాయించారని గుర్తు చేశారు. కొత్తగూడెంలో విలేకరులు చేస్తున్న ఉద్యమానికి బీఆర్ఎస్ పార్టీ నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. ప్రభుత్వం వెంటనే విలేకరులకు కేటాయించిన ఇంటి స్థలాలను విలేకరులకు మంజూరు చేయాలని, లేదంటే పత్రికా విలేకరులతో కలిసి కొత్తగూడెంలో ఉద్యమం ఉధృతం చేస్తామన్నారు.

గంగ హుస్సేన్ బస్తీలో పత్రికా విలేకరుల సోదరులు, ఇంటి స్థలాల కోసం చేస్తున్న ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలియజేసి, సంఘీభావం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్ యాదవ్, మాజీ ఎంపీపీ బాదావత్ శాంతి, మాజీ కౌన్సిలర్లు వేముల ప్రసాద్, అంబుల వేణు, రుక్మేందర్ బండారి, మండల పార్టీ అధ్యక్షులు కొట్టి వెంకటేశ్వర్లు, మాజీ ఉర్దూగర్ కమిటీ చైర్మన్ అన్వర్ పాషా, టీబీజీకేఎస్ నాయకులు కూసాన వీరభద్రం, బీఆర్ఎస్ పార్టీ నాయకులు నవతన్, తొగర రాజశేఖర్, నాగబాబు, తెలుగు అశోక్, దూడల కిరణ్, తాండ్ర శీను, శివ, అరుణ్, కరాటే శీను, మంజుల, సురేందర్, పెయింటర్ రాజేష్, ఆవునూరు చంద్రయ్య, వినోద్, సుందర్, జానీ,నిజం, అమరేందర్, బొమ్మిడి రమాకాంత్, బంగువుల శ్రీధర్, లచ్చిరాం, బొట్టు శీను, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Next Story

Most Viewed