- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టెన్షన్...పార్టీ ఫిరాయుంపు ఎమ్మెల్యేల పై రేపే తుది తీర్పు
X
దిశ, భద్రాచలం : పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై హైకోర్టు తుది తీర్పు సోమవారం వెల్లడించనుంది. బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి కాంగ్రెస్లో చేరిన భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకటరావు తో పాటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, వివేకానంద్ హైకోర్టును ఆశ్రయించారు.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేలా స్పీకర్‌కు ఆదేశాలు ఇవ్వాలని ప్రతిపక్ష ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్ పై హైకోర్టు ఆగస్టు నెలలో విచారణ జరిపి తీర్పును రిజర్వ్ చేసింది. కాగా సోమవారం తుది తీర్పు వెల్లడించనుంది. దీంతో భద్రాచలంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. తీర్పు ఎమ్మెల్యే వెంకట్రావుకు అనుకూలంగా వస్తుందా..? లేక ప్రతికూలంగా వస్తుందా..? అనే చర్చ జోరుగా సాగుతుంది.
Advertisement
- Tags
- judgment
Next Story