- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
tension :టెన్షన్...టెన్షన్...ఎమ్మెల్యేల అనర్హత వేటుపై రేపు పూర్తిస్థాయి విచారణ
దిశ, భద్రాచలం : పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. అసెంబ్లీ కార్యదర్శి సింగిల్ బెంచ్ తీర్పుపై రిట్ అప్పీల్ వేయడంతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టారు. పార్టీ ఫిరాయుంచిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు పై అనర్హత వేటు వేయాలని కొందరు బీఆర్ఎస్ నాయకులు హైకోర్టును ఆశ్రయుంచడంతో సెప్టెంబర్ 9న హైకోర్టులో విచారణ జరిపి 4 వారాల్లోగా నివేదిక సమర్పించాలని అసెంబ్లీ కార్యాలయం కార్యదర్శిని ఆదేశించారు.
సింగల్ బెంచ్ తీర్పుపై అసెంబ్లీ కార్యదర్శి రిట్ అప్పీల్ చేయడంతో మంగళవారం విచారణ జరిగింది. స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేసే అధికారం కోర్టులకు లేదని ఏజీ సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. తదుపరి విచారణ బుధవారానికి వాయిదా వేసినట్లు తెలంగాణ హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. బుధవారం ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయుంపుపై తుది తీర్పు వెలువడే అవకాశం ఉంది. దీంతో ముగ్గురు ఎమ్మెల్యేలలో తీర్పు అనుకూలంగా వస్తుందా..? ప్రతికూలంగా వస్తుందా అని టెన్షన్ నెలకొంది.