- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
central budget : కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం.. సీపీఎం
దిశ, కల్లూరు : గురువారం స్థానిక వి.ఎం.బంజర్ రింగ్ సెంటర్ లో సీపీఎం, సీఐటీయూ, పెనుబల్లి మండలం కమిటీల, ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్ ప్రతులను దగ్ధం చేశారు. కేంద్రాల్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో కార్మిక రైతాంగ పేద ప్రజానీకం వ్యతిరేకమైన బడ్జెట్ ప్రతులను సూచికగా దగ్ధం చేశారు. సీపీఎం మండల కార్యదర్శి గాయం తిరుపతి రావు అధ్యక్షతన జరిగిన సభలో సీఐటీయూ రాష్ట్రకమిటీ సభ్యులు చలమాల విఠల్ రావు మాట్లాడుతూ మంగళవారం నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలంగాణ రాష్ట్రానికి ఖమ్మం జిల్లాకు తీవ్రమైన నష్టం చేకూర్చిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఎనిమిది మంది పార్లమెంటు సభ్యులు ఉన్నప్పటికీ బీజేపీ ప్రభుత్వం తెలంగాణకి మొండిచేయి చూపిందని అన్నారు. సన్నా చిన్నకారు రైతాంగానికి ఎరువులు సబ్సిడీలు ఎత్తేసారని, రైతే దేశానికి వెన్నుముక అని చెప్పే పాలకులు ఆ రైతునే మర్చిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సత్తుపల్లి ప్రాంతంలో రైల్వే కొవ్వూరు లైన్ ను ప్రతిపాదన కనీసం ప్రస్తావం చేయలేదన్నారు. నిరుద్యోగుల గురించి పట్టించుకున్న నాథుడే లేడని, కార్మిక వర్గానికి పూర్తిస్థాయిలో బడ్జెట్ అన్యాయం చేసిందని, ఆ పెట్టుబడిదారులకు కార్పొరేషన్ భారతదేశ సిరిసంపదలను తాకట్టు పెడుతుందన్నారు. భారతదేశంలో ఉన్న 20 కుటుంబాలకే దేశ సంపదను మొత్తం కట్టబెట్టేలా నరేంద్ర మోడీ, అమిత్ షా, నిర్మల సీతారాం, వ్యవహరిస్తున్నారని. ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి గాయం తిరుపతిరావు, సీఐటీయూ నాయకులు మిద్దె స్వామి, నిమ్మల వీరయ్య, మల్లెలి నరసింహారావు, బజ్జూరు మురళీకృష్ణ, చింత చంటబ్బాయి, వత్సవాయి శ్రీనివాసరావు, దుర్గమ్మ, మరీదు వాసు, దర్గయ్య, బుర్రి సీతారాములు, బెజవాడ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.