- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దొంగల దాడిలో టేకులపల్లి డ్రైవర్ కు తీవ్ర గాయాలు
దిశ,టేకులపల్లి : గుంటూరు జిల్లాలోని వినుకొండలో శనివారం అర్ధరాత్రి పెట్రోల్ బంకు పార్కింగ్ ప్లేస్ లో టేకులపల్లి కి చెందిన లారీ డ్రైవర్ ఇస్లావత్ లాలు నాయక్ పై దొంగలు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. దాంతో నరసరావుపేట ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఆదివారం కుటుంబ సభ్యులు తెలిపారు. దీని కంటే ముందు రెండు ,మూడు సార్లు పార్కింగ్ ప్లేస్ లో దొంగతనానికి ప్రయత్నించిన దొంగలపై బంకు యాజమాన్యం ఎటువంటి చర్యలు తీసుకోకపోగా కనీసం పార్కింగ్ ప్లేస్లో కరెంట్ కానీ సీసీ ఫుటేజ్ కానీ,
పహరి గోడ రక్షణగానిలేదు. గత వారం పది రోజుల క్రితం కూడా సెల్ ఫోన్లో డబ్బులు పోగొట్టుకున్నామని , ఇతర డ్రైవర్లు మొరపెట్టుకున్నా బంకు యాజమాన్యం పట్టించుకోలేదు. బంకు యాజమాన్యంపై తక్షణమే చర్య తీసుకోవాలని డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. ఆ దొంగలకు బంకుకు సంబంధాలు ఉన్నాయని అనుకోవాల్సిన పరిస్థితి, ఎందుకంటే ఒకసారి రెండుసార్లు సంఘటనలు జరిగినప్పుడు ఎటువంటి చర్యలు చేపట్టక పోగా నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. కచ్చితంగా బంకు యాజమాన్యానికి దొంగలకు కనెక్షన్ ఉండే ఉంటుందని డ్రైవర్లు కోరారు. డ్రైవర్ కు పూర్తి ఆసుపత్రి ఖర్చులు, బంకుయాజమాన్యం భరించే విధంగా చూడాలని కుటుంబీకులు కోరారు.