- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆరు నెలల వ్యవధి.. ఉపాధ్యాయుని పై రెండు సార్లు సస్పెన్షన్ వేటు..
దిశ, కొత్తగూడెం : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కుటుంబ సర్వే విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ప్రభుత్వ ఉపాధ్యాయుడిని విద్యాశాఖ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. కొత్తగూడెం మేదర్ బస్తీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఫణి భాస్కర్ విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తుండడం, సర్వేకి హాజరు కాకపోవడం, హాజరు కావడం లేదని ఉన్నతాధికారులకు కనీస సమాచారం ఇవ్వడం లేదని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ దృష్టికి వెళ్లింది.
దీంతో పాటు పాఠశాల విధుల పట్ల తీవ్ర నిర్లక్ష్యంగా ఉంటూ, రికార్డుల సమర్పణలో అలసత్వం వహిస్తున్నాడని, పై అధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తున్న మేదర్ బస్తీ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం ఫణి భాస్కర్ పై జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకటేశ్వర చారి సస్పెన్షన్ వేటు వేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది జూన్ నెలలో విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నాడని ప్రధానోపాధ్యాయుడు ఫణి భాస్కర్ ని విద్యాశాఖ అధికారులు సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ అనంతరం విధుల్లో చేరి మూడు నెలలు కూడా గడవకముందే రెండోసారి సస్పెండ్ అయ్యాడు.