Group-3 Exams: రేపటి నుంచి గ్రూప్-3 పరీక్షలు.. పరీక్షా కేంద్రంలోకి అనుమతించేవి ఇవే!

by Shiva |   ( Updated:2024-11-16 08:40:01.0  )
Group-3 Exams: రేపటి నుంచి గ్రూప్-3 పరీక్షలు.. పరీక్షా కేంద్రంలోకి అనుమతించేవి ఇవే!
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో రేపటి నుంచి రెండు రోజుల పాటు గ్రూప్-3 (Group-3) పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు అధికారులు మొత్తం 1,401 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు మధ్య పరీక్షలను నిర్వహించనున్నారు. మొత్తం 1,365 గ్రూప్‌-3 (Group-3) పోస్టులకు గాను 5.68 లక్షల మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. నవంబర్ 17న మొదటి సెషన్‌ (First Session)లో పేపర్‌-1 పరీక్ష ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు జరగనుంది. రెండో సెషన్‌ (Second Session)లో పేపర్‌-2 మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు కొనసాగుతోంది. నవంబర్ 18న పేపర్‌-3 పరీక్ష ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు జరగనుంది.

అయితే, పరీక్ష మొదలయ్యే అరగంట మందే పరీక్షా కేంద్రం గేట్లను మూసివేస్తామని ఇప్పటికే నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఉదయం 9.30 గంటల లోపు, మధ్యాహ్నం సెషన్‌ పరీక్షకు 2.30 గంటల‌లోపు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. అదేవిధంగా అభ్యర్థులు ఎగ్జామ్ సెంటర్‌ (Exam Center)లోకి బ్లూ లేదా బ్లాక్‌ బాల్‌ పాయింట్‌ పెన్‌, హాల్‌ టికెట్‌, ప్రభుత్వం నుంచి జారీ చేసిన ఐదైనా గుర్తింపు కార్డు ఒరిజినల్ (పాస్‌పోర్టు, పాన్‌ కార్డు, ఓటరు కార్డు, ఆధార్‌కార్డు, ప్రభుత్వ ఉద్యోగి గుర్తింపు కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్) మాత్రమే తీసుకెళ్లాలి. హాల్‌టికెట్లు A-4 సైజు ప్రింటు ఉండాలి. అభ్యర్థి ఫొటో, సైన్ సరిగా ప్రింట్‌ కాకపోతే మూడు పాస్‌పోర్టు ఫొటోలపై గెజిటెడ్‌ అధికారి ధ్రువీకరణ తీసుకుని ఇన్విజిలేటర్‌కు అందజేయాలి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వస్తువులను లోపలికి అనుమతించరు.

Advertisement

Next Story