- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి
జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర్ శర్మ
దిశ, వైరా: విద్యార్థులు క్రమశిక్షణతో విద్యనభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర్ శర్మ అన్నారు. వైరాలోని న్యూ లిటిల్ ఫ్లవర్స్ పాఠశాల 8వ వార్షికోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర్ శర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కరస్పాండెంట్ పోతినేని భూమేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ప్రయోగాత్మకమైన విద్యను నేర్చుకున్నప్పుడే వారికి బంగారు భవిష్యత్తు ఉంటుంన్నారు.
మూస పద్ధతిలో చదువును బట్టి విధానానికి స్వస్తి పలకాలన్నారు. ప్రయోగాత్మకమైన విద్యతో పోటీ పరీక్షల్లో విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. గ్రామీణ విద్యార్థులకు ఆహ్లాదకరమైన ప్రాంతంలో నాణ్యమైన విద్యను అందిస్తున్న పాఠశాల యాజమాన్యాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఏసీపీ రహమాన్ మాట్లాడుతూ వైరాలో కార్పొరేట్ స్థాయికి ధీటుగా న్యూ లిటిల్ ఫ్లవర్స్ పాఠశాల విద్యార్థులకు విద్యను అందించటం అభినందనీయమన్నారు.
అనంతర విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. కార్యక్రమంలో వైరా మండల విద్యాశాఖ అధికారి కొత్తపల్లి వెంకటేశ్వర్లు, కరస్పాండెంట్ పోతినేని భూమేశ్వరరావు, డైరెక్టర్లు కాపా మురళీకృష్ణ, కుర్ర సుమన్, లగడపాటి ప్రభాకర్ రావు, ప్రిన్సిపాల్ షాజీ మ్యాథ్యూ, అడ్మినిస్ట్రేట్ ఆఫీసర్ సామినేని నరసింహారావు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రలు పాల్గొన్నారు.