- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈనెల 5 నుంచి ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం
దిశ, జూలూరుపాడు : ఈనెల 5 నుంచి ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం చుడుతున్నట్టు రాష్ట్ర గృహ నిర్మాణ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో రూ.3.62 కోట్ల విలువైన అభివృద్ధి పనులను వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో అభివృద్ధితోపాటు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని, డిసెంబర్ 5న ఇందిరమ్మ ఇండ్లకు శ్రీకారం చుట్టబోతున్నామని చెప్పారు.
రాష్ట్రంలో 4.50 లక్షల ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గానికి 3500 చొప్పున కేటాయిస్తున్నట్లు చెప్పారు. పడమటి నర్సాపురంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. నాణ్యమైన భోజనం వడ్డించాలని సూచించారు. ప్రతిరోజూ అందుబాటులో ఉంటూ మధ్యాహ్న భోజనం తనిఖీ చేయాలని తహసీల్దార్ స్వాతి బిందును ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐటీడీపీఓ రాహుల్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు లేళ్ల వెంకటరెడ్డి, బొర్రా రాజశేఖర్, మండల అధ్యక్షుడు మంగీలాల్ నాయక్, దుద్దుకూరి మధు తదితరులు పాల్గొన్నారు.