Breaking News.. కొత్త పార్టీ పెడుతున్న పొంగులేటి ?

by S Gopi |   ( Updated:2023-03-10 03:09:00.0  )
Breaking News.. కొత్త పార్టీ పెడుతున్న పొంగులేటి ?
X

దిశ, ఖమ్మం బ్యూరో: ఉమ్మడి ఖమ్మం జిల్లా.. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా నిలుస్తున్న జిల్లా. అధికార బీఆర్ఎస్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న జిల్లా.. 2014, 2018 ఎన్నికల్లో రాష్ట్రంలో అధికార పార్టీ హవా కనబరిస్తే.. ఈ జిల్లాలో మాత్రం ఒక్కటంటే ఒక్క సీటు మాత్రమే కట్టబెట్టిన జిల్లా.. మరి అలాంటి జిల్లా ప్రస్తుతం గులాబీ మయమైంది.. అయినా ఈసారి కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాపై అధికార పార్టీ పెద్దలకు కొంత డౌటుందనే ప్రచారం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మంపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఫోకస్ చేస్తున్నాయి. వాస్తవానికి ఖమ్మం ఎప్పటి నుంచో కాంగ్రెస్ కంచుకోట. అయితే జిల్లాపై కమలం అధిష్టానం పట్టు సాధించేందుకు కృషి చేస్తుంటే జిల్లాలో మాత్రం ఆ పార్టీని నడిపించే పెద్ద నాయకులు కరువయ్యారు. రాష్ట్రంలో బీజేపీ పుంజుకుంటుంటే.. ఉమ్మడి జిల్లాలో మాత్రం నడిపించే నాయకుడు లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో పొంగులేటి బీజేపీలోకి వస్తే మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోతుందనేది రాజకీయ విశ్లేషకుల మాట.

ఇదే మంచి సమయం..

ఒకప్పుడు ఖమ్మం కమ్యూనిస్టులు, కాంగ్రెస్‌కు కంచుకోట. 2018 ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో వేరే పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కొందరు అధికార పార్టీలోకి తీరారు. దీంతో అధికార పార్టీలో ఆధిపత్య పోరు మొదలైంది. కాంగ్రెస్‌ను నడిపించే నాయకులు లేకుండా పోయారు. ఈ నేపథ్యంలో ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాల్సిన బీజేపీ సైతం సరైన నాయకుడు లేక సతమతం అవుతున్నది. స్థానిక నాయకులు ఉన్నా.. వారు పార్టీ పటిష్టతకు ఏ మాత్రం ప్రయోజనం లేకుండా పోయింది. రాష్ట్ర నాయకత్వం ముఖ్యంగా స్టేట్ చీఫ్ బండి సంజయ్ జిల్లాలో పర్యటనలు, ప్రసంగాలతో యూత్‌లో సైతం మంచి జోష్ వచ్చింది. అయినా స్థానిక నాయకత్వం మాత్రం ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని పార్టీని ముందుకు తీసుకెళ్లలేకపోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

క్యాడర్లో నైరాశ్యం..

బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఖమ్మంపై ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. అయినా అధికారపార్టీ దూకుడును జిల్లా నాయకత్వం తట్టుకోలేకపోవడంతో కమలం క్యాడర్ అంతా నిరుత్సాహంలోకి వెళ్లిపోయారు. ఒకానొక దశలో ద్వితీయ శ్రేణి నాయకత్వం తమ అనుచరగణంతో పక్కచూపులు చూశారు. మళ్లీ ఇప్పుడిప్పుడే బీజేపీ క్యాడర్ యాక్టివేట్ అవుతున్నది. యువత కమలం వైపు బాగా ఆకర్షితులవుతున్నారు. ఎలాగైనా ఈసారి అధికార పార్టీ బీజేపీయే పోటీ అనుకుంటున్నారు. కొంచెం కష్టపడితే జిల్లాలో కాషాయం జెండా ఎగర వేయొచ్చనే అంచనాలు ఉన్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

పొంగులేటి చేరితే..

పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీజేపీలో చేరుతున్నారనే ప్రచారం జరుగుతున్నది. మరోవైపు సొంతపార్టీ పెడుతున్నారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒకవేళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీజేపీలో చేరితే.. కమలం పార్టీకి తిరుగుండదనే వాదన వినిపిస్తోంది. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో పొంగులేటి తిరుగుతూ ఆత్మీయ సమ్మేళనాల పేరుతో తన టీం రెడీ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే పొంగులేటి కాషాయ కండువా కప్పుకుంటే పరిస్థితులు మారే అవకాశం ఉందంటున్నారు. ఆయనతోపాటు భారీగా అనుచరలతోపాటు ద్వితీయ శ్రేణి నాయకులు సైతం పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ పొంగులేటి చేరితో దాదాపు అన్ని నియోజకవర్గాలో ఆయన ఎఫెక్ట్ ఉండడమే కాకుండా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాషాయ పార్టీ బలం పుంజుకుంటుందనే చర్చ జరుగుతున్నది.

Advertisement

Next Story

Most Viewed