పర్యాటక కేంద్రంగా సింగభూపాలెం ప్రాజెక్టు

by Sridhar Babu |
పర్యాటక కేంద్రంగా సింగభూపాలెం ప్రాజెక్టు
X

దిశ, కొత్తగూడెం రూరల్ : సింగభూపాలెం ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా మారుస్తామని, అందుకు అవసరమైన నిధుల కోసం కేంద్రం, రాష్ట్రంపై ఒత్తిడి తెస్తానని ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురామిరెడ్డి అన్నారు. గురువారం ఎంపీ సుజాతానగర్ మండల పరిధిలో ఉన్న సింగభూపాలెం ప్రాజెక్టు చెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక కాంగ్రెస్ నాయకులు చెరువు పరిస్థితిపై ఎంపీకి వివరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సింగభూపాలెం ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా మార్చడంతో పాటు అన్ని వసతులు కల్పించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. ప్రాజెక్ట్ కరకట్ట పటిష్టంగా ఉండేందుకు చుట్టూ ప్రొటెక్షన్ వాల్ ఏర్పాటు చేయిస్తానని, ఇందుకుగాను ప్రతిపాదనలు తయారు చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు, సుజాతానగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చింతలపూడి రాజశేఖర్, కొత్తగూడెం సొసైటీ చైర్మన్ మండే వీరహనుమంతరావు, మాజీ ఎంపీటీసీ భద్రం, కాంగ్రెస్ కిసాన్ సెల్​ నాయకులు మడిపల్లి శ్రీనివాస్, పైడా ప్రసాద్, నాగార్జున, జిల్లా కాంగ్రెస్ నాయకులు లింగం పిచ్చిరెడ్డి, భాగం మోహన్ రావు, చందర్, రాచబంటి బాబు, చంద్రయ్య, బత్తుల కేశవరావు, ఎట్టి భాస్కర్, గరిక సాంబయ్య, బైరు సాంబయ్య, శ్రీనివాసరెడ్డి, గరిక జయరాజు, నర్రా అజయ్, గురిజాల సీతయ్య, భద్రూ, అమృ, చిమట నాగేశ్వరావు, నాగయ్య, శ్రీను, జిల్లా సోషల్ మీడియా రాష్ట్ర సెక్రటరీ రామలక్ష్మణ్, సేవాదళ్ అధ్యక్షులు నరేష్, యువజన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్కే అబిద్, సెక్రటరీ కోటేష్ నాయక్, జిల్లా మైనారిటీ ఉపాధ్యక్షులు ఎండీ. కరీమ్ పాషా, యువజన కాంగ్రెస్ నాయకులు తేజావత్ శ్రీను, సాయి నాగరాజు, ప్రసాద్, సూరయ్య, రవీందర్, స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed