ఫ్యామిలీ ఫంక్షన్‌‌‌ను రేవ్ పార్టీగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు: మాజీ మంత్రి హరీశ్ రావు

by Mahesh |   ( Updated:2024-10-27 15:12:52.0  )
ఫ్యామిలీ ఫంక్షన్‌‌‌ను రేవ్ పార్టీగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు: మాజీ మంత్రి హరీశ్ రావు
X

దిశ, వెబ్ డెస్క్: జన్వాడ(Janwada)లో శనివారం రాత్రి జరిగిన పార్టీ వ్యవహారం పై మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) స్పందించారు. కేటీఆర్‌‌పై బురదజల్లడంలో భాగంగానే కేటీఆర్‌(KTR) బావమరిదిపై డ్రగ్స్ కేస్ అంటూ రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు ఇది పరాకాష్ట అని ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చారు. అదే ట్వీట్‌లో ప్రజల దృష్టి మళ్లించేందుకు జన్వాడ ఫాంహౌజ్‌‌(Janwada Farmhouse)లో రేవ్ పార్టీలు(Rave parties) జరిగాయంటూ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ సోషల్‌ మీడియా వేదికగా ప్రచారాలు చేస్తోందని అన్నారు. రాజ్‌ పాకాల నివాసంలో ఫ్యామిలీ ఫంక్షన్‌ ఉందని ముందుగానే ప్రభుత్వ పెద్దలకు తెలుసని.. పక్కా ప్లాన్ ప్రకారమే ఫ్యామిలీ ఫంక్షన్‌‌పై దాడిచేసి దాన్ని రేవ్ పార్టీగా చిత్రీకరించే ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని హారీశ్ రావు (Harish Rao) అన్నారు. అలాగే రెండు రోజుల నుంచి రాష్ట్ర మంత్రులు(ministers), కాంగ్రెస్ పార్టీ సోషల్‌ మీడియాలో శని, ఆదివారాల్లో రాష్ట్రంలో బాంబులు పేలుతాయని అనడం, చెప్పినట్లుగానే ఇళ్లపై దాడులు చేయడం చూస్తే.. ఇది ప్రభుత్వం రూపొందించిన స్కెచ్ అని స్పష్టం అవుతోందని ఆరోపించారు.

అలాగే వృద్ధులు, చిన్నపిల్లలు, భార్యాభర్తలు ఉన్న ఫ్యామిలీ ఫంక్షన్‌(Family function)ను డ్రగ్స్ పార్టీగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కేటీఆర్, ఆయన సతీమణి, ఆ ఫ్యామిలీ ఫంక్షన్‌కి వెళ్లకపోయినా వెళ్లినట్టు చిత్రీకరిస్తున్నారని.. కేటీఆర్‌(KTR) వ్యక్తిత్వాన్ని, ఇమేజ్‌‌ను దెబ్బతీసే ప్రయత్నం రేవంత్‌‌రెడ్డి ప్రభుత్వం చేయడం రాజకీయ కక్ష సాధింపు చర్య తప్ప మరేమీ కాదని అన్నారు. రాష్ట్ర పోలీసులు, ఎక్సైజ్‌ అధికారులు ప్రభుత్వ ఒత్తిళ్లకు లొంగవద్దని, నిజాయితీగా ఉన్నది ఉన్నట్టు చెప్పాలని, వ్యవస్థపై అపనమ్మకం కలిగేలా ప్రవర్తించవద్దని విజ్ఞప్తి చేశారు. రోజురోజుకు ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ డ్రామా ఆడుతున్నారని.. రాజకీయాల్లో తమను నేరుగా ఎదుర్కోలేక కుటుంబ సభ్యులను అడ్డం పెట్టుకొని చీప్ పాలిటిక్స్ చేయడం మానుకోవాలని హెచ్చరిస్తున్నానని ఈ సందర్భంగా హరీష్ రావు రాసుకొచ్చారు.

Advertisement

Next Story