HYD: అబిడ్స్‌లో భారీ అగ్నిప్రమాదం (వీడియో)

by Gantepaka Srikanth |   ( Updated:2024-10-27 17:28:38.0  )
HYD: అబిడ్స్‌లో భారీ అగ్నిప్రమాదం (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్/కార్వాన్: హైదరాబాద్‌(Hyderabad)లోని అబిడ్స్‌(Abids)లో భారీ అగ్నిప్రమాదం(Fire Accident) చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి 9 గంటల తర్వాత బొగ్గులకుంటలోని మయూర్‌ పాన్‌షాపు వద్దనున్న క్రాకర్స్‌ షాపు(Crackers Shop)లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగిసిపడి క్రాకర్స్‌కు అంటుకోవడంతో చుట్టుపక్కల మొత్తం వ్యాపించాయి. పక్కనే ఉన్న హోటల్‌కు వ్యాపించడంతో హోటల్ ఎదుట పార్క్ చేసిన దాదాపు పది వాహనాలు పూర్తిగా దగ్ధం అయ్యాయి. విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన ఘటనా స్థలానికి చేసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైరింజన్లతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అగ్నిప్రమాదానికి(Fire Accident) గమనించిన స్థానికులు భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. అగ్రిప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story