Arrest:మహిళ మెడలోని బంగారం దోచుకెళ్లిన నిందితుడు అరెస్ట్​

by Sridhar Babu |
Arrest:మహిళ మెడలోని బంగారం దోచుకెళ్లిన నిందితుడు అరెస్ట్​
X

దిశ,ఉప్పల్ : దోపిడీ దొంగను పోలీసులు అరెస్టు (Arrest)చేసిన సంఘటన నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ మైబిల్లి (SI Mybilli)తెలిపిన వివరాల ప్రకారం నాచారం ఐడీఏలోని రోడ్డు నెంబర్ 15లో డ్యూయల్ టెక్నాలజీస్ ఎదురుగా కడ్తాల కనుకవ్వ టీ షాప్ నడుపుతుంది. ఆమె మెడలో 30 గ్రాముల బంగారం ఉండడం చూసిన బెంగాల్ రాష్ట్రానికి చెందిన సాగర్ పండిట్(21) ఈ నెల 6వ తేదీన రాత్రి సమయంలో ఆమెను బెదిరించి మెడ నుంచి బంగారం దోచుకెళ్లారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు క్రైమ్ డీఐ శ్రీశైలం, డీఎస్ఐ అలీ చొరవ తీసుకొని నిందితుడిని వెస్ట్ బెంగాల్లో పట్టుకొని 13 గ్రాముల గోల్డ్ బిస్కెట్స్ ను (Gold Biscuits)స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసి నాచారం పోలీస్ స్టేషన్ కి తరలించారు. అనంతరం రిమాండ్ కు పంపారు.

Advertisement

Next Story