ఏకంగా 10 ఏళ్ల తర్వాత థియేటర్స్‌లోకి రాబోతున్న స్టార్ హీరో మూవీ.. రిలీజ్ ఎప్పుడంటే?

by Hamsa |
ఏకంగా 10 ఏళ్ల తర్వాత థియేటర్స్‌లోకి రాబోతున్న స్టార్ హీరో మూవీ.. రిలీజ్ ఎప్పుడంటే?
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్‌గణ్(Ajay Devgn) నటించిన మూవీ ‘నామ్’. అయితే ఈ సినిమాకు అనీస్ బజ్మీ(Anees Bazmee) దర్శకత్వం వహించగా.. రూంగ్ట ఎంటర్‌టైన్‌మెంట్, స్నిగ్ధ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై అనిల్ రూంగ్ట(Anil Roongta) నిర్మించారు. ఇందులో భూమికా చావ్లా(Bhumika Chawla), సమీరా రెడ్డి(Sameera Reddy) హీరోయిన్లుగా నటించగా.. 2014లోనే ‘నామ్’ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. కానీ విడుదలకు నోచుకోలేదు.

అప్పటి నుంచి పలు కారణాల చేత ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఇన్నాళ్లకు ‘నామ్’(Naam) సినిమా థియేటర్స్‌లో విడుదలకు సిద్ధం అయింది. తాజాగా, ‘నామ్’ (Naam) మేకర్స్ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. ఏకంగా 10 ఏళ్ల తర్వాత ‘నామ్’ (Naam) చిత్రం నవంబర్ 22న విడుదల కాబోతున్నట్లు వెల్లడించారు. దీంతో అజయ్ దేవ్‌గణ్(Ajay Devgn) ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. కాగా, అజయ్ నటించిన సింగం అగైన్, భూల్ భులయ్యా-3 కూడా నవంబర్ 1వ తేదీన విడుదల కాబోతున్నాయి. అయితే మూడు చిత్రాలు ఒకే నెలలో విడుదల కాబోతుండటం విశేషం.


Next Story

Most Viewed