రిలీజ్‌కు సిద్ధమైన శ్రీవిష్ణు సినిమా.. తగ్గేదేలే పవన్ కళ్యాణ్‌కు పోటీగా రాబోతున్నాడంటూ ట్వీట్

by Hamsa |   ( Updated:2025-04-25 14:25:10.0  )
రిలీజ్‌కు సిద్ధమైన శ్రీవిష్ణు సినిమా.. తగ్గేదేలే పవన్ కళ్యాణ్‌కు పోటీగా రాబోతున్నాడంటూ ట్వీట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు(Sri Vishnu) హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా వరుస చిత్రాల్లో నటిస్తూ ఫుల్ జోష్‌లో ఉన్నాడు. గత ఏడాది రెండు సినిమాలు చేసిన ఆయన ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సింగిల్’. కార్తీక్ రాజు(Karthik Raju) దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రం అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, కళ్యా ఫిల్మ్స్‌ బ్యానర్స్‌పై విద్యా కొప్పినీడి, భాను ప్రతాప్(Bhanu Pratap), రియాజ్ చౌదరి నిర్మిస్తున్నారు. అయితే విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ఇవానా, కేతిక శర్మ(Ketika Sharma) హీరోయిన్లుగా నటిస్తుండగా.. వెన్నెల కిశోర్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.

అయితే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి విడుదలైన అప్డేట్స్ అన్ని ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచాయి. ఇదిలా ఉంటే.. తాజాగా, ఈ సినిమా విడుదలకు సిద్ధమైనట్లు మూవీ మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేస్తూ ఓ పోస్టర్‌ను షేర్ చేశారు. అయితే ఈ చిత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’కు పోటీగా మే 9న థియేటర్స్‌లోకి రాబోతున్నట్లు వెల్లడించారు. ఇక పోస్టర్‌లో శ్రీవిష్ణును ఇద్దరు హీరోయిన్లు గట్టిగా హగ్ చేసుకుని కనిపించారు. అయితే పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా కూడా అదే రోజు విడుదల కాబోతుండటం విశేషం. దీంతో ‘సింగిల్’ మూవీ వాయిదా పడుతుందని అంతా భావించారు. ఈక్రమంలోనే మూవీ మేకర్స్ విడుదల తేదీ ప్రకటించి వాయిదా పడే ప్రసక్తి లేదనట్లుగా పోస్టర్‌ను కూడా షేర్ చేశారు.



Next Story

Most Viewed