Thieves:దారిదోపిడి దొంగల అరెస్ట్

by Jakkula Mamatha |
Thieves:దారిదోపిడి దొంగల అరెస్ట్
X

దిశ,తణుకు: పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో దారి దోపిడీలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను తణుకు పట్టణ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఈనెల 24న రాత్రి ఇరగవరం నుంచి తణుకు వైపు వెళుతున్న రెండు లారీలను ముగ్గురు వ్యక్తులు ఇరగవరం కాలనీ వద్ద ఆపి డ్రైవర్లను డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించారు. ఒక లారీ డ్రైవర్‌ను గాయపరిచి ఆయన జేబులో రూ.వెయ్యి లాక్కొని పారిపోయారు. గాయాలపాలైన బాధితులు తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తణుకు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తణుకు పాతవూరు ఇరగవరం కాలనీకు చెందిన కొల్లాటి రత్నకుమార్, సరుకుల సురేష్, తుంపాల కన్నబాబు అలియాస్ రాజు నిందితులుగా పోలీసులు గుర్తించారు. వీరిపై కేసు నమోదు చేసిన పట్టణ ఎస్సై కె.శ్రీనివాస్ తణుకు కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు.

Advertisement

Next Story