గంజాయి ఆయిల్ విక్రయిస్తున్న ఏడుగురి అరెస్ట్

by Sridhar Babu |   ( Updated:2024-01-15 11:31:46.0  )
గంజాయి ఆయిల్ విక్రయిస్తున్న ఏడుగురి అరెస్ట్
X

దిశ,కామారెడ్డి : గంజాయి నుంచి తీసిన ఆయిల్ ను విక్రయిస్తున్నారనే పక్కా సమాచారం మేరకు దేవునిపల్లి ఎస్సై రాజు తన సిబ్బందితో దాడి నిర్వహించి ఏడుగురిని అరెస్ట్ చేయడంతో పాటు వారి వద్దనున్న ఐదు వాహనాలు సీజ్ చేశారు. వీరి నుంచి రూ.97, 500 విలువైన 190 గ్రాముల గంజాయి ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై రాజు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి...ఆదివారం సాయంత్రం క్యాసంపల్లి గ్రామ శివారులో గల ఓపెన్ ప్లేస్ లో గంజాయి అమ్ముతున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు అక్కడికి వెళ్లగా అక్కడ ఉన్న ఏడుగురిని పట్టుకున్నారు.

వారిని విచారించగా వారి వద్ద 190 గ్రాముల గంజాయి నుండి తీసిన ఆయిల్ దొరికింది. దీనిని ఇద్దరు వ్యక్తులు తమ స్వలాభం కోసం అరకు నుండి గంజాయి ఆయిల్ ను తక్కువ ధరకు తీసుకువచ్చి దానిని ఇక్కడున్న యువకులకు అధిక ధరకు అమ్మి డబ్బులు సొమ్ము చేసుకునేవారు. ఇందులో భాగంగానే వీరిద్దరు అక్కడున్న మిగతా ఐదుగురికి ఈ గంజాయి ఆయిల్ ను అమ్ముతుండగా పోలీసులు చాకచక్యంగా పట్టుకొని కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. వీరి వద్ద రెండు కార్లు, ఒక మోటార్ సైకిల్, రెండు స్కూటీలు, 7 మొబైల్ ఫోన్లతో పాటు 97500 ల విలువైన 190 గ్రాముల గంజాయి నుంచి తీసిన ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed