చీమలపాడు క్షతగాత్రుడికి ఎమ్మెల్యే రాములు నాయక్ రూ.లక్ష చేయూత..

by Hamsa |
చీమలపాడు క్షతగాత్రుడికి ఎమ్మెల్యే రాములు నాయక్ రూ.లక్ష చేయూత..
X

దిశ, వైరా: కారేపల్లి మండలం చీమలపాడు గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సింగరేణి సీఐ గన్మెన్ నవీన్ కు వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఖమ్మంలోని సంకల్ప హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న నవీన్ ను శుక్రవారం ఎమ్మెల్యే రాముల నాయక్ పరామర్శించారు. నవీన్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు ఎమ్మెల్యే రాములు నాయక్ సూచించారు. క్షతగాత్రుడు తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. నవీన్ త్వరితగతిన కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

Advertisement

Next Story