- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Rega Kantha Rao : భద్రాద్రి రైతులను ఎండా కడుతున్నారు
దిశ,మణుగూరు : సీతారామ ప్రాజెక్టు కెనాల్ నుంచి వచ్చే సాగునీరు భద్రాద్రి జిల్లాలోని పినపాక,అశ్వరావుపేట,కొత్తగూడెం,ఇల్లందు నియోజకవర్గాలకు అందించాలని భద్రాద్రి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు,పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ముగ్గరు మంత్రులు కలిసి భద్రాద్రి జిల్లాకు అన్యాయం చేస్తున్నారని ఘాటు విమర్శలు కురిపించారు.భద్రాద్రి జిల్లాకు సాగునీరు అందించాలని ఉద్దేశంతో బుధవారం బీఆర్ఎస్ నాయకులతో కలసి స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ధర్నా చేపట్టారు.డాం..డాం కాంగ్రెస్ అంటూ వ్యతిరేక నినాదాలు చేశారు.అనంతరం రెవిన్యూ అధికారికి వినతిపత్రం అందజేశారు.
ఈసందర్బంగా కార్యాలయం ముందు మీడియాతో మాట్లాడుతూ భద్రాద్రి రైతులకు సాగునీరు అందించాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా 8వేల కోట్ల రూపాయలతో సీతారామ ప్రాజెక్టు నిర్మాణం చేశారని తెలిపారు.నిర్మాణంలో కొంత పనులు మిగిలి ఉండగా ఈలోగా ఎన్నికలు రావడంతో ప్రాజెక్టు పనులు నిలిచిపోయాన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాజెక్టు పెండింగ్ పనుల కోసం 70కోట్ల రూపాయలు నిధులు కేటాయించి నామాత్రంగా పనులు పూర్తి చేశారని ఆరోపించారు.కృష్ణ కెనాల్ ను-సీతారామ ప్రాజెక్టు కెనాల్ కు అనుసంధానం చేసి దాని ద్వారా వైరా,మధిర,పాలేరు నియోజకవర్గాలకు సాగునీరు తరలించడం దారుణమన్నారు. భద్రాద్రి రైతాంగానికి సాగునీరు అందించకుండా ముగ్గురు మంత్రులు తమ వ్యక్తి గత స్వార్థ రాజకీయంతో ఖమ్మం జిల్లాకు తరలించుకుపోతున్నారని ఎద్దేవా చేశారు.
భద్రాద్రి రైతులు పండించే రెండు పంటల పొలాలను సీతారామ ప్రాజెక్టు నిర్మాణం కోసం త్యాగం చేసి పుట్టెడు దుఃఖంలో ఉంటే ఈప్రాంత రైతాంగానికి చుక్కనీరు ఇవ్వకుండా పక్క జిల్లాకు తరలించుక పోవడం దురదృష్టకరం మండిపడ్డారు.భద్రాద్రి రైతులను ఎండబెట్టి సీతారామ ప్రాజెక్టు సాగునీరును ఖమ్మం జిల్లాకు తరలిస్తే రైతులతో కలిసి సీఎం కార్యక్రమాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈధర్నాలో నాయకులు కోలేటి భవాని శంకర్,మణుగూరు మాజీ జడ్పిటిసి పోశం నరసింహారావు,ముత్యం బాబు,అడపా అప్పారావు,ఎడ్ల సురేష్, కోడి అమరేందర్,మర్రి మల్లారెడ్డి,సూదిరెడ్డి గోపిరెడ్డి,కొల్లు మల్లారెడ్డి పాల్గొన్నారు.