మత్య్సావతారంలో రామయ్య

by Sridhar Babu |
మత్య్సావతారంలో  రామయ్య
X

దిశ, భద్రాచలం : భద్రాచలం శ్రీసీతారామ చంద్ర స్వామి వారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభం అయ్యాయి. మొదటి రోజు శ్రీ స్వామి వారు మత్య్సావతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజల అనంతరం మిథలా స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదిక వద్ద భక్తుల దర్శనం కోసం ఉంచారు. తర్వాత మేళతాళాలు, మంగళ వాయుద్యాలు, వేదమంత్రాలు, భక్తుల జయజయ ద్వానాల నడుమ స్వామి వారికి రాజవీధిలో తిరువీధి సేవ నిర్వహించగా పెద్ద ఎత్తున భక్తులు మంగళ నీరాజనాలు పలికారు.

Advertisement

Next Story