Good News: జ‌ర్న‌లిస్టులకు గుడ్ న్యూస్.. రాజీవ్‌ స్వగృహ ఇళ్ల వేలం! ఎప్పుడంటే?

by Ramesh N |
Good News: జ‌ర్న‌లిస్టులకు గుడ్ న్యూస్.. రాజీవ్‌ స్వగృహ ఇళ్ల వేలం! ఎప్పుడంటే?
X

దిశ, డైనమిక్ బ్యూరో: జర్నలిస్టులకు రేవంత్ సర్కార్ (Revanth government) శుభవార్త చెప్పింది. బండ్ల‌గుడ‌, పోచారం, గాజుల రామారం, జవ‌హ‌ర్ న‌గ‌ర్‌లో రాజీవ్ స్వ‌గృహ కార్పోరేష‌న్ నిర్మించిన ఫ్లాట్లును ఓపెన్ ఆక్ష‌న్ ద్వారా విక్ర‌యించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ప్ర‌భుత్వం నిర్ణ‌యించే క‌నీస‌ధ‌ర‌కు కొనుగోలు చేసుకోవ‌డానికి ఆస‌క్తి గ‌ల జ‌ర్న‌లిస్ట్‌లు త‌మ పేర్ల‌ను ఇస్తే వారికి ఈ నాలుగు ప్రాంతాల‌లోని ఫ్లాట్‌ల‌ను చూపించ‌డం జ‌రుగుతుంది. ఇందుకోసం జ‌ర్న‌లిస్ట్‌లు ఈ నెల 5వ తేదీలోగా త‌మ పేర్ల‌ను వాట్సాప్ ద్వారా 7702003518 నెంబర్‌కు పంపాలని, మ‌రిన్ని వివ‌రాల‌కు ఇదే నెంబరును సంప్ర‌దించాలని, రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ (I & PR department) తాజాగా ఒక ప్రకటనలో తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed