Chiranjeevi vs Balakrishna: సోషల్ మీడియాలో మళ్లీ ఫ్యాన్ వార్ స్టార్ట్

by Gantepaka Srikanth |   ( Updated:2025-01-03 16:05:28.0  )
Chiranjeevi vs Balakrishna: సోషల్ మీడియాలో మళ్లీ ఫ్యాన్ వార్ స్టార్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: నటసింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ప్రధాన పాత్రలో నటిస్తోన్న డాకు మహరాజ్(Daku Maharaj) చిత్రం సంక్రాంతి(Sankranthi) కానుకగా జనవరి 12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. షూటింగ్ ప్రక్రియ మొత్తం పూర్తి కాగా.. ప్రస్తుతం చిత్రబృందం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. తాజాగా.. డాకు మహారాజ్‌ నుంచి ‘దబిడి దిబిడి’ సాంగ్ రిలీజ్ అయ్యింది. ఇందులో బాలయ్య, ఊర్వశీ(Urvashi Rautela)లు వేసిన స్టెప్స్‌పై సోషల్ మీడియా వేదికగా పలువురు అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. హీరోయిన్ నడుముపై బాలయ్య దరువు వేయడంతో పాటు నడుముపై చేయి వేసే సీన్ ఉండటంతో నెటిజన్లు మరోసారి రెచ్చిపోతున్నారు. దీంతో ట్రోల్ చేసేది మెగా ఫ్యాన్సే అని భావించిన నందమూరి అభిమానులు.. గతంలో చిరంజీవి(Chiranjeevi) చేసిన రొమాంటిక్ సాంగ్స్‌ను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసి మరి వీటి సంగతేంటి? బ్రదర్స్ అని ప్రశ్నిస్తున్నారు.

‘ఒకరిని విమర్శించే ముందు మనది మనం చూసుకోవాలి’ అని ఒకరిపై ఒకరు మెగా, నందమూరి ఫ్యాన్స్ రెచ్చిపోయి పోస్టుల మీద పోస్టులు, కామెంట్ల మీద కామెంట్లు చేస్తూ రెచ్చిపోతున్నారు. ప్రస్తుతం దబిడి దిబిడి సాంగ్‌ ట్రెండింగ్‌లో ఉంది. కాగా, ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటివరకు రెండు పాటలు విడుదల కాగా, రెండింటికీ మంచి స్పందన లభించింది. ఇక ఇప్పుడు మూడవ గీతం విడుదలైంది. ‘డాకు మహారాజ్’ చిత్రం నుంచి అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న మూడవ గీతం ‘దబిడి దిబిడి’ని తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది.

Advertisement

Next Story