Khokho Championship: 13నుంచి ఖోఖో ఛాంపియన్‌షిప్‌ వరల్డ్ కప్ మ్యాచ్‌లు

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2025-01-03 10:39:51.0  )
Khokho Championship: 13నుంచి ఖోఖో ఛాంపియన్‌షిప్‌ వరల్డ్ కప్ మ్యాచ్‌లు
X

దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీ(Delhi)వేదికగా జరిగే ప్రప్రథమ ఖోఖో ఛాంపియన్ షిప్(Khokho Championship)వరల్డ్ కప్(World Cup) నిర్వాహణకు రంగం సిద్ధమైంది. జనవరి 13 నుంచి 19 వరకు ఢిల్లీ వేదికగా ఖోఖో ఛాంపియన్‌షిప్‌ వరల్డ్ కప్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ టోర్నమెంట్‌లో 24దేశాలకు చెందిన 21 పురుషుల జట్లు, 20 మహిళల జట్లు పోటీపడనున్నాయి. పోటీల నిర్వాహణకు సంబంధించిన అధికారిక లోగోలు తేజస్, తారా మస్కట్‌లతో పాటు మెన్స్ కప్ ట్రోఫీని ఆవిష్కరించారు.

భారత్ పాక్ మధ్య మ్యాచ్ తో పోటీలు ప్రారంభంకానున్నాయి. పోటీల ప్రారంభోత్సవ వేడుకలను అట్టహాసంగా నిర్వహిస్తామని, ఇంటర్నేషనల్ ఖోఖో ఫెడరేషన్ అధ్యక్షుడు సుధాంశు మిట్టల్, కార్యదర్శి త్యాగి, ప్రపంచ కప్ సీఈవో విక్రమ్ దేవ్ డోగ్రా తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed