ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకోవాలి

by Sridhar Babu |
ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకోవాలి
X

దిశ, చర్ల : ప్రభుత్వ పథకాలను పేదలు అందిపుచ్చుకోవాలని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పేర్కొన్నారు. ఆదివారం చర్ల తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. పేదల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పేదవాడి సొంత ఇంటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు నిర్మించబోతుందన్నారు. మొత్తం 20 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎం.శ్రీనివాస్, ఆర్ ఐలు వరలక్ష్మి, సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు చర్ల సొసైటీ అధ్యక్షులు పరుచూరి రవికుమార్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed