- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Delhi Assembly Election: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి బీజేపీ ఢిల్లీ చీఫ్ దూరం..!
దిశ, నేషనల్ బ్యూరో: దేశ రాజధాని దిల్లీ (Delhi)లో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కాగా.. బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ (Virendra Sachdeva) ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉంది. అయితే, ఇప్పటికే అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) పూర్తి అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మరోవైపు, బీజేపీ (BJP) ఇప్పటి వరకు ఒక్క జాబితాను కూడా విడుదల చేయలేదు. ఈ క్రమంలో సచ్‌దేవ పోటీ అంశంపై చర్చ జరుగుతోంది. ఇళాంటి టైంలో ఆయన ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు
ఆమ్ ఆద్మీ పార్టీ 2015 నుండి ఢిల్లీలో అధికారంలో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో రెండుసార్లు ఆప్ భారీ మెజారిటీ సాధించింది. కానీ, 2014 నుంచి లోక్‌సభ ఎన్నికల్లో ఆప్ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. మొత్తం ఏడింటిని బీజేపీ గెలుచుకుంది. మరోవైపు ఎన్నికలు (Delhi Assembly Election 2025) సమీపిస్తుండగా.. పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఢిల్లీలో ఓటర్లకు బీజేపీ నగదు పంపిణీ చేస్తోందని ఆప్ ఆరోపించింది. ఈమేరకు ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఆర్ఎస్ఎస్ (RSS) అధ్యక్షుడు మోహన్ భగవత్‌కు ఇటీవలే లేఖ రాశారు. కాషాయ పార్టీ చేస్తున్న తప్పిదాలను ఆర్ఎస్ఎస్ సమర్థిస్తుందా? అని అందులో ప్రశ్నించారు. ఈ లేఖపై బీజేపీ స్పందించింది. మోహన్ భగవత్ కు లేఖ రాయడానికి బదులు ఆ సంస్థ నుంచి సేవా స్ఫూర్తిని నేర్చుకోవాలని కేజ్రీవాల్‌కు హితవు పలికింది. కొత్త సంవత్సరం అసత్య హామీలు, అబద్ధాలు చెప్పడం మానుకోవాలనే తీర్మానం తీసుకోవాలని కేజ్రీవాల్‌కు సచ్‌దేవ చురకలు అంటించారు.