Puvvada Ajay Kumar : 52వ డివిజన్ లో పువ్వాడ అజయ్ సతీమణి ప్రచారం

by Sridhar Babu |   ( Updated:2023-11-21 13:15:02.0  )
Puvvada Ajay Kumar : 52వ డివిజన్ లో పువ్వాడ అజయ్ సతీమణి ప్రచారం
X

దిశ, ఖమ్మం : ఖమ్మం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ గెలుపును కాంక్షిస్తూ ఖమ్మం నగరం 52వ డివిజన్ లో పువ్వాడ అజయ్ కుమార్ సతీమణి పువ్వాడ వసంత లక్ష్మీ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..మన ఖమ్మం కోసం ఎంతో శ్రమించి అభివృద్ది చేసిన అజయ్ కుమార్ కు అండగా నిలవాలని కోరారు. అజయ్ కుమార్ ను కొందరు మోసం చేశారని, ప్రజలు మాత్రం ఆయన వైపే ఉన్నారని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో కారు గుర్తు పై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్పొరేటర్ బుర్రి వెంకట్ కుమార్, కొల్లు పద్మ, బత్తుల తిరుమల రావు, సూత్రాల శ్రీనివాస్, నన్నెబోయిన సురేష్, ఖాదర్, మేడేపల్లి రమేష్, పువ్వాడ పార్థసారథి, ఫకృద్దీన్, పాషా, కాసిమళ్ల భవాని, వీరయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed