- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కిన్నెరసానిలో పుట్టి ట్రయల్ రన్
దిశ, కొత్తగూడెం : జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధిలో భాగంగా కిన్నెరసాని ప్రాజెక్ట్ లో శనివారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన కిన్నెరసాని ప్రాజెక్ట్ కుడి కాలువలో పుట్టిలో ప్రయాణించి ట్రైల్ రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పుట్టిలో ప్రయాణించడం ద్వారా పర్యాటకులకు మంచి అనుభూతి కలుగుతుందని అన్నారు. కిన్నెరసాని ప్రాజెక్టు పరిసర ప్రాంతాలు వీక్షిస్తూ పర్యాటకులు ఈ పుట్టి ప్రయాణం చేయడం ద్వారా ఆహ్లాదకరమైన వాతావరణం, కిన్నెరసాని అందాలను తిలకించొచ్చని పేర్కొన్నారు.
అదేవిధంగా మత్స్యకారులు వీటిని నడపడం ద్వారా వారికి ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందని తెలిపారు. కిన్నెరసానిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడంలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులకు, పర్యాటకులకు భద్రతపై పలు సూచనలు చేశారు. అతి త్వరలో లబ్ధిదారులను ఎంపిక చేసి విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతామన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.