ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు ధర్నా

by S Gopi |   ( Updated:2023-01-08 14:14:05.0  )
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు ధర్నా
X

దిశ, ఇల్లందు టౌన్: సీఐటీయూ ఆధ్వర్యంలో ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్ పీఎంహెచ్ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న డైలీ వేజ్ ఔట్ సోర్సింగ్ వర్కర్లకు పాత బస్టాండ్ సెంటర్ నుండి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి, ఎమ్మెల్యే కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు అబ్దుల్ నబీ, కృష్ణ మాట్లాడుతూ గత 22 మాసాలుగా, డైలీ వేజ్ కు 8 నెలల వేతన బకాయిలు పెండింగ్లో ఉన్నాయని, పెంచిన పీఆర్ సీ వేతనాలు అమలు చేయడం లేదని, పీఎఫ్ లో ఉన్న అవకతవకల్ని సరిచేయడం లేదన్నారు. రూ. 10 లక్షల ఇన్స్యూరెన్స్ సౌకర్యం కల్పించడంలేదని గత ఏడు మాసాలుగా అనేక పర్యాయాలు ఐటీడీఏ పీవో, కమిషనర్ గిరిజన సంక్షేమ మంత్రి దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్రంలోని గిరిజన నియోజకవర్గ కేంద్రాలలో ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు సమర్పించి వారి ద్వారా ముఖ్యమంత్రి కేసిఆర్ దృష్టికి తీసుకెళ్లి వేతనాలు పొందే అవకాశం ఉంటుందని ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో ఈసం పద్మ, జయ, అంజమ్మ, సుబ్రమణ్యం, సమ్మక్క, సుగుణ, సుశీల, లక్ష్మీ, రాజమ్మ, రమ, రజిత, రమని జానకి, లక్ష్మణ్ పాసి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story