నేడు పాలేరులో పొంగులేటి పర్యటన

by Sridhar Babu |   ( Updated:2023-09-30 12:54:47.0  )
నేడు పాలేరులో పొంగులేటి పర్యటన
X

దిశ, ఖమ్మం రూరల్​ : తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆదివారం పాలేరు నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు క్యాంపు కార్యాలయ ఇంచార్జీ తుంబూరు దయాకర్​రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పర్యటనలో భాగంగా కూసుమంచి మండలంలోని నాయకన్ గూడెం, మందడి నర్సయ్యగూడెం, జక్కేపల్లి, గోరిలాపాడుతండా, జుజ్జులరావు పేట,

పాలేరు, ఎర్రగడ్డ తండా, క్రిష్టాపురం, చేగొమ్మ గ్రామాలను, ఖమ్మం రూరల్ మండలంలోని కామంచికల్, జానాబాద్ తండా, మద్దివారి గూడెం తదితర గ్రామాలను సందర్శిస్తారని, ఆయా గ్రామాలను సందర్శించి పలు బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదారుస్తారని తెలిపారు. కావున నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో హాజరై పొంగులేటి పర్యటనను విజయవంతం చేయాలని దయాకర్ రెడ్డి కోరారు.

Advertisement

Next Story

Most Viewed