Loan waiver Josh : మీ 'రుణం' తీర్చుకుంటున్నాం

by Sridhar Babu |
Loan waiver Josh : మీ రుణం తీర్చుకుంటున్నాం
X

దిశ, కూనుమంచి : కాంగ్రెస్ అంటేనే రైతు సంక్షేమ ప్రభుత్వమని, వారి బాగు కోరుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా రుణమాఫీ అమలు చేసి..వారి రుణం తీర్చుకుంటున్నామని ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష పంట రుణాలను మాఫీ చేసిన సందర్భాన్ని పురస్కరించుకుని గురువారం నాయకన్ గూడెం, కూసుమంచిలో నిర్వహించిన రైతు నంబరాల్లో ఎంపీ పాల్గొన్నారు. నాయకన్ గూడెం టోల్ ప్లాజా నుంచి కూసుమంచిలోని రైతు వేదిక వరకు రైతులు ట్రాక్టర్ల ర్యాలీని నిర్వహించగా ఎంపీ రఘురాం రెడ్డి, మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి స్వయంగా ట్రాక్టర్లు నడిపి కర్షకుల్లో ఉత్తేజం నింపారు.

సీఎం, మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీని వానరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు చిత్రపటాలకు రైతులు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ రఘురాం రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే ఇచ్చిన గ్యారంటీలను అమలు చేసిందన్నారు. రైతులకు ఏక కాలంలో రూ.2లక్షల వరకు రుణాలను మాఫీ చేస్తూ.. మాట నిలబెట్టుకుందన్నారు. గత ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదని, వారికి రుణమాఫీ చేయకుండా తాత్సారం చేసిందని విమర్శించారు. రైతులకు వ్యవసాయాన్ని పండుగలా చేసేలా

ఈ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధిలో సాగుతుందని ఆయన అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, రానున్న స్థానిక ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేయాలని ఎంపీ కోరారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ బాణోత్ శ్రీనివాన్ నాయక్, ఎంపీటీసీ మాదాసు ఉపేందర్ రావు, మాజీ ఎంపీపీలు జూకూరి గోపాలరావు, ఎడవెల్లి ముత్తయ్య, రామసహాయం వెంకటరెడ్డి, కాంగ్రెన్ మండల అధ్యక్షులు మట్టి గురవయ్య, నాయకులు కొప్పుల చంద్రశేఖర్ రావు, బాజ్జూరి వెంకటరెడ్డి, భీష్మాచారి, రామిరెడ్డి, వ్యవసాయశాఖ ఏడీఏ విజయచంద్ర, ఏఓ వాణి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.



Next Story