- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాలేరు సాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేసిన అధికారులు
by Prasanna |
X
దిశ, కూసుమంచి: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని పాలేరు రిజర్వాయర్ సాగర్ ఎడమ కాలువకు ఎట్టకేలకు మంగళవారం తెల్లవారుజామున అధికారులు నీటిని విడుదల చేశారు. సెప్టెంబర్ 1 న కురిసిన వర్షాలకు, వరద తాకిడికి కాలువకు గండిపడిన విషయం తెలిసిందే. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు కాలువ వద్ద గత 20 రోజుల నుండి నత్త నడకన సాగుతున్న మరమ్మత్తు, పునరుద్ధరణ పనుల విషయంలో సోమవారం రిజర్వాయర్ వద్ద గండిపడ్డ ప్రాంతాలను పరిశీలించి ఇరిగేషన్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో అధికారులు యుద్ధప్రతిపాదికన పునరుద్ధరణ పనులు వేగవంతంగా పూర్తి చేసి మంగళవారం తెల్లవారుజామున రిజర్వాయర్ ఆయకట్టు మూడు లక్షల హెక్టార్లకు సాగునీటిని విడుదల చేయడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.
Advertisement
Next Story