- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గబ్బుతో కొత్త జబ్బులు
దిశ, కొత్తగూడెం రూరల్ : స్వచ్ఛమైన వాతావరణంతో కనిపించాల్సిన ప్రభుత్వ దవాఖాన కంపు కొడుతుంది. దాంతో ఇటు రోగులు అటు సహాయకులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఉన్న రోగాన్ని తగ్గించుకునేందుకు ఆసుపత్రికి వస్తే కొత్త జబ్బులు వచ్చేలా ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భద్రాద్రి జిల్లా ప్రభుత్వ దవాఖాన సమస్యలకు నిలయంగా నిలిచింది. ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని గతంలో సీపీఎం ఆధ్వర్యంలో ఆస్పత్రి ముందు అనేక నిరసన కార్యక్రమాలు నిర్వహించినా ఫలితం లేదు.
ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులను భర్తీ చేయాలని, సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ సదుపాయం కల్పించాలని, మందులను అందుబాటులో ఉంచాలని, ఆస్పత్రి ప్రాంగణంలో వెదజల్లుతున్న మురుగు నివారణకు చర్యలు చేపట్టాలని డిమాండ్లతో ఆందోళన నిర్వహించి సంబంధిత అధికారులకు వినతి పత్రాలు అందించిన విషయం తెలిసిందే. రోజులు గడుస్తున్నా ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలు పరిష్కారం కాలేదు. సెప్టిక్ ట్యాంకుల నుండి వచ్చే దుర్వాసనతో ఆందోళన చెందుతున్నారు.
పొంగుతున్న సెప్టిక్ ట్యాంకుల మురుగు...
జిల్లా ప్రధాన ఆస్పత్రి ప్రాంగణంలో గత కొన్ని నెలలుగా సెప్టిక్ ట్యాంకులలో మురుగు నిండిపోయి పొంగి పొర్లడంతో ఆ మురుగంతా కాలువల్లో పారుతూ బయటికి వస్తుంది. ఈ మురుగును చూసిన జనం ఆందోళన చెందుతున్నారు. ఉన్న రోగాన్ని తగ్గించుకునేందుకు ఆసుపత్రికి వస్తే కొత్త జబ్బులు వచ్చే అవకాశం ఉందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముక్కులు పగిలిపోయేలా దుర్వాసన వస్తున్నప్పటికీ పట్టించుకునే దిక్కేలేదు.
గబ్బువాసనపై ప్రజావాణిలో ఫిర్యాదు...
ప్రభుత్వ ప్రజా వైద్యశాలలో వెదజల్లుతున్న గబ్బు వల్ల ఇటు రోగులు అటు సహాయకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దుర్వాసన సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఇటీవల జరిగిన ప్రజావాణిలో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థి, యువజన సంఘం ప్రధాన కార్యదర్శి కోటా శివశంకర్ జిల్లా జాయింట్ కలెక్టర్కు వినతిపత్రం అందించారు.
ఆస్పత్రి ఆవరణలో పారుతున్న మురుగునీటి సమస్యను పరిష్కరించకపోతే నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా జిల్లా కలెక్టర్ వైద్య విద్యపై ఫోకస్ పెట్టి వాటి అభివృద్ధికి చిత్తశుద్ధితో ముందుకు వెళ్తున్నారు. ఇటీవల వైద్యశాలలను కలెక్టర్ తనిఖీ చేసినప్పుడు కూడా అనేకమంది జిల్లా ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలపై వివరించారు. అయినా ఫలితం లేకపోయింది. ఇప్పటికైనా వైద్యశాఖ ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.